Begin typing your search above and press return to search.

మహేష్ సోదరిగా నటించడానికి ఒప్పుకుంటుందా..?

By:  Tupaki Desk   |   18 Jan 2022 2:49 PM GMT
మహేష్ సోదరిగా నటించడానికి ఒప్పుకుంటుందా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మహేష్ కు ఫైనల్ నెరేషన్ ఇచ్చిన త్రివిక్రమ్.. సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టేసారు.

ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. సాంకేతిక నిపుణులను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ 28వ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ సోదరిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుందట.

SSMB28 చిత్రాన్ని యాక్షన్ జోనర్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ దీనికి సిస్టర్ సెంటిమెంట్ ని జత చేయబోతున్నారట. ఇందులో కీలకమైన చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవి అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే 'భోళా శంకర్' చిత్రంలో చిరంజీవి సిస్టర్ గా కనిపించడానికి నిరాకరించిన పల్లవి.. మరి ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు సోదరిగా నటించడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.

కాగా, మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇంతకుముందు 'అతడు' 'ఖలేజా' వంటి క్లాసిక్ మూవీస్ తెరకెక్కాయి. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత మూడో సినిమా కోసం కలుస్తుండటంతో అందరిలో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. అన్నీ కుదిరితే మహేష్ బాబు 28వ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత ఆ మధ్య హింట్ ఇచ్చారు. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని చివరి దశకు తీసుకొచ్చిన మహేష్.. త్వరలోనే త్రివిక్రమ్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.