వీడియో : సన్నీ చిలిపి పనితో ఆమె భర్త షాక్

Sun Aug 09 2020 23:00:01 GMT+0530 (IST)

Sunny leone Fun with husband daniel weber

సన్నీలియోన్ హీరోయిన్ గా ఐటెం పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఈమె గతం వల్ల మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు సినిమాలు మరియు సోషల్ మీడియాలో పోస్ట్aు ఇంకా తన మంచి మనసుతో నెట్టింట ఎప్పుడు కూడ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని నవ్వించింది. ఈసారి తన భర్త డానియల్ వెబర్‌పై ఫ్రాంక్ వీడియోను చేసి అందరిని నవ్వించింది.డానియల్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆద మరిచి నిద్ర పోతున్న సమయంలో అతడి రెండు కాళ్ల మద్య బెలూన్‌లో వాటర్ పెట్టి దాన్ని పగులగొట్టింది. దాంతో షాక్ అయ్యి నిద్ర లేచిన డానియల్ అక్కడ నుండి పరుగు పెట్టాడు. ఈ వీడియోను సన్నీలియోన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ కామెంట్స్ వస్తున్నాయి.

ఏం చేయమంటారు డానియల్ పై ప్రాంక్ చేయడం చాలా ఈజీ. అందుకు ఆయన నాకు సహకరించేలా నిద్ర పోయాడు. అందుకే ఇలా చేశాను. చాలా మంచి భర్త అంటూ తన భర్తపై పొగడ్తలు కురిపించింది. సన్నీ ఈమద్య కాలంలో పిల్లల వీడియో లు మరియు ఫొటోలతో రెగ్యులర్‌గా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి