సన్నీ పిల్లలు కూడా అదే పని చేస్తారా?

Tue Apr 23 2019 23:00:01 GMT+0530 (IST)

Sunny Leone gets emotional while remembering her late crew

మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ సినిమాలకు పరిమితం అయ్యింది. ఇండియాలో ప్రస్తుతం సన్నీలియోన్ ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా - ఐటెం సాంగ్ ఆర్టిస్టుగా రాణిస్తూ వస్తోంది. అయితే ఆమె ఎంతగా వదిలేయాలనుకున్నా గతం  మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆమెను ఎంతో మంది ఇంకా పోర్న్ స్టార్ గానే చూడటంతో పాటు - ఆమెను సోషల్ మీడియా ద్వారా వేదిస్తున్నారు. తాజాగా కొందరు సన్నీలియోన్ పిల్లలను కూడా వదలకుండా ట్రోల్ చేస్తున్నారట.సన్నీలియోన్ ఇటీవల అర్బాజ్ ఖాన్ నిర్వహించే టాక్ షో లో పాల్గొంది. ఆ సందర్బంగా సన్నీ మాట్లాడుతూ.. చాలా మంది నా ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా ఎంటర్ అయ్యి - విమర్శలు చేస్తున్నారు. సన్నీలియోన్ ఎప్పటికైనా ఆమె పిల్లలను తాను గతంలో చేసిన పనే చేయించనుందా అంటున్నారు. సన్నీలియోన్ తన పిల్లలపై కొందరు చేస్తున్న ట్రోల్స్ కు నొచ్చుకుంది. అయితే వారి ట్రోల్స్ కు సున్నితంగా సమాధానం చెప్పింది.

నా పిల్లలను అలా చేయాలని నేను భావించడం లేదు - నేను ఎందుకు అలా చేస్తాను - గతంలో జరిగిందాన్ని మళ్లీ మళ్లీ ఆలోచించడం లేదు. నన్ను ఎవరు బలవంతంగా ఆ రంగంలోకి దించలేదు నేను అందులోకి వెళ్లాను - బయటకు వచ్చాను. నా పిల్లలను అలా ఎందుకు పంపించాలని నేను అనుకుంటాను. నా పిల్లలు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తాను. లేదంటే నేను ఇటీవలే ప్రారంభించిన కాస్మోటిక్స్ వ్యాపారంను కొనసాగిస్తాను అంటే ఆనందంగా అప్పగిస్తాను - లేదంటే పెర్ ఫ్యూమ్ బిజినెస్ చేస్తానంటే దాన్ని కూడా నేను సమర్ధిస్తాను. అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నా వారి ఇష్టంగానే వదిలేస్తాను. ఒక వేళ వారు బాలీవుడ్ లో అడుగు పెడతానంటే మరింత సంతోషంగా సమర్ధిస్తాను. నా పిల్లలను వారి అభిరుచికి తగ్గట్లుగా వెళ్లేలా ప్రోత్సహిస్తాను అంది. గతంలో నేను కరెక్ట్ అనుకున్న నిర్ణయం ప్రకారం పోర్న్ స్టార్ అయ్యాను. నా పిల్లలు అలాంటి నిర్ణయాలను తీసుకోరని నేను నమ్ముతున్నాను అంది.