స్విమ్మింగ్ వీడియోతో నెట్టింట రచ్చ చేస్తున్న బేబీడాల్!!

Tue Jul 07 2020 22:30:34 GMT+0530 (IST)

Baby Doll Swimming Video goes viral

ఇండియన్ గ్లామరస్ బ్యూటీ సన్నీ లియోన్. అంటే సినీ ప్రియులకు.. శృంగార ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. కరోనా కారణంగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితం అయిన ఈ అమ్మడు.. గడిచిన జీవితం పక్కన పెట్టి ప్రస్తుతం భారత్ లో సెటిల్ అయింది. సినీ ప్రపంచం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తనకు కలిసొచ్చిన అందాలను సినిమా వైపు మళ్లించి కుర్రకారు మదిని మీటుతోంది. ఎప్పుడైనా సరే ఇంటర్నెట్‌లో నెటిజన్లు వెతికే పేర్లలో సన్నీ టాప్ లో ఉంటుంది. అలాంటి సన్నీ లియోన్ తన అందాలను ప్రదర్శనగా నిలిపిన ఫొటోలు ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎలాంటి వారైనా సన్నీ స్టైల్ చూసిన వారు ఫిదా అయిపోతారు మరి. జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిపోయింది.ప్రస్తుతం సన్నీ నెట్టింట హీట్ పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పోస్టులు పెడుతూ అభిమానులను మురిపిస్తోంది. ఎల్లప్పుడూ బికినీలో రచ్చ చేసే సన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్‌స్టాగ్రామ్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలో లాక్‌డౌన్ ఉన్న సమయంలో సన్నీ తనకు నచ్చిన లైఫ్‌ను మాత్రం మిస్ కావడం లేదు. క్వారెంటైన్ ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ తో కలిసి చూపిస్తోంది. సోషల్ మీడియాలో క్రేజీ డాళ్‌గా మారిన సన్నీకి 3.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా సన్నీ స్విమ్మింగ్ వీడియో ఒకటి ఇన్‌స్టాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను చూడటానికి కుర్రకారు పోటీ పడుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అమ్మడు. అన్నట్టు సన్నీకి పెళ్లయి ముగ్గురు పిల్లలున్న సంగతి మర్చిపోయిందని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.