Begin typing your search above and press return to search.

ఒంటిపై నూలుపోగైనా లేకుండా స‌న్నీ ఫోజులు

By:  Tupaki Desk   |   13 Jun 2021 4:30 PM GMT
ఒంటిపై నూలుపోగైనా లేకుండా స‌న్నీ ఫోజులు
X
బాలీవుడ్ లో ప్ర‌ఖ్యాత ఫోటోగ్రాఫ‌ర్ డ‌బు ర‌త్నానీ వార్షికోత్స‌వ‌ క్యాలెండ‌ర్ కి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్యాలెండ‌ర్ లో క‌నిపించేందుకు స్టార్లంతా ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తారంటే అతడి రేంజును అర్థం చేసుకోవ‌చ్చు. కొన్నేళ్లుగా డ‌బు ర‌త్నానీ ఈ రంగంలో నిష్ణాతుడిగా కొన‌సాగుతున్నారు.

ఈ వారం ప్రారంభంలో బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్.. విద్యాబాలన్ .. విక్కీ కౌషల్ వంటి స్టార్ల‌తో డ‌బూ వ‌ర‌స‌ ఫోటో షూట్లు చేశారు. ఆ ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ఆదివారం.. సన్నీ లియోన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని పంచుకోవడం ద్వారా క్లబ్ లో చేరారు. ఈ ఫోటోలో సన్నీ.. భారీ టోపీ.. స్టిలెట్టోస్ తప్ప ఒంటిపై నూలుపోగైనా లేకుండా పోజులిచ్చింది.

అస‌లు మేక‌ప్ తో ప‌ని లేకుండా ఒక స్థంబానికి ఆనుకుని కెమెరాకు పోజు ఇచ్చింది. `వేస‌వి ఇక్కడ ఉంది !!`` అనే క్యాప్షన్ తో సన్నీ ఈ ఫోటోని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. డ‌బూ కూడా ఈ ఫోటోని సోష‌ల్ మీడియాల్లో పంచుకున్నారు. డబూరత్నాని కేలెండర్ # 2021 కోసం ఫోజులివి. స‌న్ షైన్ కోస‌మే అయినా పెద్ద టోపీ అవ‌స‌రం అని ఆయ‌న చిలిపి వ్యాఖ్య‌ను జోడించారు. స‌న్నీలియోన్ కెరీర్ ప‌రంగా వెబ్ సిరీస్ లు సినిమాల‌తో బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. య‌ష్ రాజ్ సంస్థ‌లోనూ న‌టిస్తోంది.