‘మర్యాద క్రిష్ణయ్య’గా సునీల్..!

Sun Feb 28 2021 09:40:35 GMT+0530 (IST)

Sunil as 'Maryada Krishnayya' ..!

హీరోగా కాస్త గ్యాప్ ఇచ్చిన సునీల్.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ‘డిటెక్టివ్ రామకృష్ణ’ అంటూ క్రైమ్ బ్యాక్ డ్రాప్ సినిమా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచిన సునీల్.. ఇప్పుడు ‘మర్యాద క్రిష్ణయ్య’ అంటూ ప్రేక్షకులకు ముఖం చూపించాడు.ఈ తరం కమెడియన్లలో అగ్రశ్రేణి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఆ తర్వాత ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిపోయాడు. తొలి చిత్రంతో మంచి హిట్ కొట్టిన సునీల్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. ఈ సినిమా సునీల్ కు కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే.. ఆ తర్వాత చేసిన చిత్రాలేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఇతర క్యారెక్టర్లకు షిఫ్ట్ అయ్యాడు.

కాగా.. ‘కనబడుట లేదు’ అంటూ ఇటీవల సినిమా ప్రకటించాడు. ఇందులో డిటెక్టివ్ రామకృష్ణగా కనిపించబోతున్నాడు. తాజాగా ‘మర్యాద క్రిష్ణయ్య’ అనే సినిమాతో రాబోతున్నాడు. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సునీల్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్లో సునీల్ భయపడుతూ కనిపిస్తున్నాడు. గోడ చాట నుంచి భయం భయంగా ఎవరినో గమనిస్తున్నాడు. అయితే.. ‘మర్యాద క్రిష్ణయ్య’ అంటూ పేరుతోనే ఇంప్రెషన్ క్రియేట్ చేశారు మేకర్స్. సునీల్ సూపర్ హిట్ మూవీ ‘మర్యాద రామన్న’ను గుర్తు చేశారు. ఇతర వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.