Begin typing your search above and press return to search.

SSMB28 : బాలీవుడ్‌ స్టార్ ను దించబోతున్న త్రివిక్రమ్‌

By:  Tupaki Desk   |   17 Jan 2022 9:42 AM GMT
SSMB28 : బాలీవుడ్‌ స్టార్ ను దించబోతున్న త్రివిక్రమ్‌
X
మహేష్‌ బాబు హీరోగా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రీకరణ జరుగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే గత ఏడాది లోనే సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తి అయ్యి వెంటనే మహేష్ బాబు.. త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేది. గత ఏడాది సెకండ్‌ వేవ్‌ వచ్చి ఉండకుంటే ఖచ్చితంగా సర్కారు వారి పాట పూర్తి అయ్యి ఈ సమ్మర్ లో మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కాని ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాలేదు. పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్‌ తన సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం నటీ నటుల ఎంపిక దాదాపుగా పూర్తి అయ్యిందట. హీరోయిన్ ఎవరు అనే విషయం పై అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. కాని ఇప్పటికే మహేష్‌ కు జోడీని ఎంపిక చేసినట్లుగా మాత్రం తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో కన్నడ స్టార్‌ రవిచంద్రన్‌ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆయనతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు లో ఆయన నటించిన కారణంగా మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ సినిమాలో నటించేందుకు ఆయన ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు ఉన్న సునీల్‌ శెట్టిని సినిమాలో నటింపజేయడం వల్ల హిందీ డబ్బింగ్‌ రైట్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ వచ్చి పుష్కర కాలం అయ్యింది. ఈ పుష్కర కాలంలో పదేళ్లుగా వీరిద్దరి కాంబో మూవీ అదుగో ఇదుగో అంటూ చర్చించుకోవడం జరిగింది. అది ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది తెలియకున్నా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించబోతున్నాయి.. త్రివిక్రమ్‌.. మహేష్‌ బాబుల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది అనుకుంటూ ఉండగా కరోనా వేవ్‌ ల మీద వేవ్‌ లు వచ్చి షూటింగ్‌ జరగకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ సమ్మర్ నుండి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది.