Begin typing your search above and press return to search.

సునీల్ 'కలర్ ఫోటో'తో విలన్ గా మెప్పిస్తాడా..?

By:  Tupaki Desk   |   2 April 2020 10:30 AM GMT
సునీల్ కలర్ ఫోటోతో విలన్ గా మెప్పిస్తాడా..?
X
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు తెలుగు ప్రేక్షకులను తమ కామెడీతో నవ్వించారు. అయితే కొంత మంది కమెడియన్లు హీరోగా కూడా తమ సత్తా చాటారు. వాళ్లలో సునీల్ తనదైన మార్క్ కామెడీతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఒకానొక సమయం లో సునీల్ యాక్ట్ చేయకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అయితే సునీల్ 'అందాల రాముడు' సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాదరామన్న'తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే వరుసగా సినిమా ఛాన్సులు రావడంతో హీరోగా కంటిన్యూ అయ్యారు. కొంత కాలంగా సునీల్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫెయిల్యూర్స్ అవుతూ వస్తున్నాయి.

దీంతో మళ్లీ కామెడీగానే స్థిరపడాలని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య లాంటి కమెడియన్స్ బాగా పోటీ వస్తున్నారు. దాంతో ఇప్పుడు విలన్ తరహా పాత్రలను చేయడానికి కూడా సునీల్ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. రవితేజ హీరోగా నటిించిన 'డిస్కోరాజా'లో సునీల్ విలన్ గా కనిపించినప్పటికీ ప్రేక్షకులు దానిని కూడా కామెడీగానే తీసుకున్నారు. ఆ సినిమా కూడా పరాజయాన్ని చవిచూడటంతో, సునీల్ సాహసాన్ని జనాలు ఎవరూ పెద్దగా పట్టించుకో లేదు. ప్రస్తుతం సునీల్ 'కలర్ ఫోటో' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సునీల్ తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. ఇటీవల కమెడియన్ గా పరిచయమైన సుహాస్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మరి ఈ కొత్త హీరోకి సీనియర్ నటుడు అయిన సునీల్ విలన్ గా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. విభిన్నమైన ఈ విలన్ రోల్ పైనే సునీల్ ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాతో నైనా విలన్ గా మెప్పిస్తాడేమో చూడాలి. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.