ఫోటో స్టోరి: సూర్యుడే ముద్దాడితే

Mon Aug 19 2019 13:33:29 GMT+0530 (IST)

Sun-Kissed Anushka In A Bikini

2017లో విరుష్క జోడీ పెళ్లి ట్విస్టు తెలిసిందే.  విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ తో సడెన్ షాకిచ్చారు ఈ జోడీ. ఆ తర్వాత పెళ్లి వ్యవహారంలో ఈ జంటను పలువురు స్టార్లు ఫాలో అయిన సంగతి తెలిసిందే. సీక్రెట్ గా పెళ్లికి  ఏర్పాట్లు చేసుకోవడం అభిమానులకు సడెన్ ట్విస్టివ్వడం కథానాయికలకు అలవాటు వ్యాపకంగా మారింది. పెళ్లి తర్వాత విరాట్- అనుష్క జోడీ ముంబైలోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం అనుష్క- విరాట్ జంట తమకు సంబంధించిన ప్రతిదీ అప్ డేట్ చేస్తూనే ఉంటారు. ఈ అన్యోన్య జంటను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ అటు బాలీవుడ్ సర్కిల్స్ తో పాటు టీమిండియా సభ్యుల నుంచి ఏవో సరదా కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి.తాజాగా అనుష్క శర్మ వెస్టిండీస్ టూర్ లో బిజీగా ఉన్న కోహ్లీ వెంటే ఉన్నారు. అక్కడ తీరిక వేళల్లో అరుదైన బీచ్ లొకేషన్లలో సెలబ్రేషన్ మోడ్ లోకి వెళుతోంది ఈ జంట. వెస్టిండీస్ అంటిగ్వాలో సువిశాలమైన బీచ్ లలో అనుష్క బికినీ లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ ఫోటోకి అనుష్క ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. `సన్ కిస్డ్ అండ్ బ్లెస్డ్` (సూర్యుడు ముద్దాడి ఆశీర్వదించారు) అంటూ వ్యాఖ్యను జోడిస్తే దానికి రిప్లయ్ గా విరాట్ కోహ్లీ `హార్ట్ అండ్ లవ్ స్ట్రక్ ఈమోజీ`ని షేర్ చేశారు. దీంతో పాటే విరాట్ మరిన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

టీమిండియా ఆటగాడిగా 11 సంవత్సరాల సుదీర్ఘమైన జర్నీ పూర్తయింది. ఈ సందర్భంగా టీనేజర్ గా ఉన్నప్పటి ఫోటో ఒకటి కోహ్లీ షేర్ చేశారు. 2008లో టీమిండియా ఆటగాడిగా పయనం మొదలైంది. తొలి మ్యాచ్ లో 11 పరుగులు సాధించి పెవిలియన్ కి వెళ్లిన కోహ్లీ ఆ తర్వాత ఎదురేలేని ఆటగాడిగా చివరికి టీమిండియా రధసారథిగా ఎదిగిన తీరు అసమానం. బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన విరాట్ అటుపై కెప్టెన్ గా పరిణతి చెందిన ఆటతో టీమిండియాకు అసాధారణ విజయాల్ని అందిస్తున్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్ గా ఇండియాని తీర్చిదిద్దారు.