ఇదేం టైటిల్ బాబు?

Mon Nov 18 2019 22:09:11 GMT+0530 (IST)

Sumanth Kapatadari Motion Poster

కొన్ని సినిమాలు ముందు ఒక హీరోతో అనుకొని చివరికి మరో హీరోని ఎంచుకొని సెట్స్ పైకి వెళ్తుంటాయి. తాజాగా ఒక రీమేక్ సినిమా ముందు రాజశేఖర్ దగ్గరికి వెళ్లి అనౌన్స్ అయి ఆ తర్వాత మళ్ళీ సుమంత్ దగ్గరికి చేరింది. ఇటివలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు తాజాగా టైటిల్ ప్రకటించారు.ప్రదీప్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 'కపటదారి' అనే  టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ వదిలారు. అయితే టైటిల్ చూసిన అందరూ ఇదేం టైటిల్ సుమంత్ అంటూ నవ్వుకున్నారు.  కన్నడలో సూపర్ హిట్టైన 'కవలుదారి' అనే సినిమాకు ఇది రీమేక్. అందుకే అదే టైటిల్ ను కాస్త అటు ఇటుగా మార్చి ఏదో అర్థం వచ్చేట్టు పెట్టేసారు.

టైటిల్ అర్థం ఏమిటా అనేది పక్కన పెడితే సినిమా టైటిల్ అనేది అందరికీ రీచ్ అయ్యే విధంగా క్యాచీగా ఉండాలి. కానీ అవేం పట్టించుకోకుండా సుమంత్ అండ్ టీం ఇలా అందరికీ కనెక్ట్ అవ్వని ఓ టైటిల్ ని ఫిక్స్ చేసేసుకొని రిలీజ్ చేసేసారు. మరి  సుమంత్ ఈ టైటిల్ తో సినిమాను ప్రేక్షకులకు ఎలా చేరుస్తాడో చూడాలి.