పుష్ప 2.. కొత్తదేదో రాబోతుందట

Fri Mar 31 2023 09:52:07 GMT+0530 (India Standard Time)

Sukumar to Suprise Pushpa Fans

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూ ఉంది. వియత్నంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లుగా సమాచారం. అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నాడని తెలుస్తోంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేకంగా తెరకెక్కిస్తూ ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే ఏప్రిల్ 7వ తేదీన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ప్రత్యేకంగా గ్లింప్స్ కానీ టీజర్ కానీ విడుదల చేస్తారు అనే ప్రచారం నడుస్తోంది.

అయితే దర్శకుడు సుకుమార్ ఆలోచన మాత్రం బన్నీ బర్త్ డే సర్ప్రైజ్ విషయంలో ఇంకా ప్రత్యేకంగా ఉందంట. ఇప్పటివరకు రానటువంటి విధంగా ఈ సినిమా నుంచి ఒక కొత్త రీతిలో ప్రోమో కట్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గా ఇవ్వబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్.

 కేవలం అల్లు అర్జున్ మీద మాత్రమే ప్రోమో కట్ చేసి ప్రత్యేకంగా డిజైన్ చేస్తారంట. ఆయన మీద ఎలివేషన్స్ షాట్స్ ఏవైతే తీసారో వాటితోనే ఈ ప్రోమో కట్ చేయబోతున్నారని టాక్. ఇది చాలా ప్రత్యేకంగా ఉండబోతుందనే మాట వినిపిస్తుంది. కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చే విధంగా సుకుమార్ ట్రీట్ ఇవ్వబోతున్నారని చిత్ర యూనిట్ వర్గాలనుంచి వినిపిస్తూ ఉన్న సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై బన్నీ ఆర్మీతో పాటు అల్లు అర్జున్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఏకంగా 1000 కోట్లు ఈ సినిమాతో కలెక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రచారం నడుస్తూ ఉంది. దానికి తగ్గట్లుగానే హై వోల్టేజ్ ఎలిమెంట్స్ తో  పాటు పవర్ఫుల్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా కథలో భాగంగా చూపించే ప్రయత్నం చేయాలని డిసైడ్ అయినట్లుగా టాక్.

 మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కచ్చితంగా ఈ సీక్వెల్ కి ఆ బజ్ ఉంటుంది. దానిని మరింత హై పిచ్ కి తీసుకువెళ్లడం ద్వారా సినిమాకి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చేలా ప్రమోషన్ ప్లానింగ్ కూడా సుకుమార్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.