Begin typing your search above and press return to search.

దర్శకులలో గురువంటే ఇలా ఉండాలి..

By:  Tupaki Desk   |   1 April 2023 5:33 PM GMT
దర్శకులలో గురువంటే ఇలా ఉండాలి..
X
టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా ఆర్య. ఆ సినిమాలో ఫీల్ మై లవ్ అంటూ కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ స్టార్ దర్శకుడుగా మారాడు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని సుకుమార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ జీనియస్ డైరెక్టర్ గా సుకుమార్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక సుకుమార్ దగ్గర టెక్నీషియన్స్ గా పని చేస్తే కచ్చితంగా తర్వాత వాళ్లు సక్సెస్ ఫుల్ దర్శకులుగా మారే ఛాన్స్ ఉంటుందనే ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

దానికి కారణం సుకుమార్ టీం నుంచి వస్తున్న డైరెక్టర్స్ అందరూ కూడా తమ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకోవడమే అని చెప్పాలి. పల్నాటి సూర్య ప్రతాప్ సుకుమార్ శిష్యుడిగా కుమారి 21ఎఫ్ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా టాలీవుడ్ లో సరికొత్త కథతో వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకుంది. రీసెంట్ గా ఈ దర్శకుడు 18 పేజెస్ సినిమాతో గత ఏడాది సూపర్ హిట్ అంటున్నారు.

ఇక సుకుమార్ టీం నుంచి వచ్చిన బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన డెబ్యూ దర్శకుడుగా రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఈ దర్శకుడు రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా చేసి గురువు సరసన చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ అనే సినిమాతో హరిప్రసాద్ జక్కా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఆ మూవీ డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కింది. పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు దసరా సినిమాతో శ్రీకాంత్ ఒదేల ఓ కల్ట్ కంటెంట్ ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ కూడా వంద కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతున్నట్లు ఉంది.

ఇలా సుకుమార్ శిష్యులు అందరూ కూడా గురువు దగ్గర మంచి వర్క్ చేసుకొని అద్భుతమైన కథలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులుగా మారుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.