సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయనకు.. హీరో హీరోయిన్ల కంటే ఎక్కువనే క్రేజ్ ఉంటుంది. ఆర్య సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన పుష్ప చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మొదటి సినిమాతోనే అటు ఇండస్ట్రీని ఇటు ప్రేక్షకులను ఆకట్టుకున్నారీ లెక్కల మాస్టర్. దర్శకుడిగా నిర్మాతగా స్క్రీన్ ప్లే రైటర్గా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సుకుమార్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు చాలామంది ఇప్పుడు పరశ్రమలో డైరెక్టర్లుగా రాణిస్తున్నారు.
సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన సూర్య ప్రతామ్... కుమారి 21 ఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత నిఖిల్ తో 18 పేజెస్తో డీసెంట్ హిట్ ను అందుకున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ అనుపమ కాంబోలో తెరకెక్కిన ఈ క్యూట్ లవ్ స్టోరీకి బ్రహ్మ రథం పట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు బుచ్చిబాబు సనా. ఈయన సుకుమార్కు ప్రియ శిష్యుడును అంటూ ఉంటారు. గురువు గారి పేరు నిలబెడుతూ తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్తో ఏకంగా రామ్ చరణ్తో ఆర్సీ 16 చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ దాదారు రూ.270కోట్లతో నిర్మించనుందని టాక్.
ఇక ఈ రోజు నాని హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న చిత్రం దసరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డైరెక్టర్ కూడా సుక్కు స్కూల్ నుంచి వచ్చినవాడే. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
ఇకపోతే దసరాలో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు అయినా.. అనుభవం ఉన్న వాడిలా తెరకెక్కించారని అన్నారు.
ఇక మరో యంగ్ హీరో సాయితేజ్ హీరోగా... కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ చిత్రం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టీజర్ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈచిత్రానికి విరూపాక్ష అనే పేరు ఖరారు చేశారు. సంయుక్త మేనన్ కథానాయిక. సుకుమార్ రైటింగ్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈయన కూడా సుక్కు స్కూల్ నుంచి వచ్చిన వాడే. ఈయన ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.