బొమ్మాళీలా మారిన సుక్కూ వదలనే వదలడు!

Mon May 03 2021 09:00:02 GMT+0530 (IST)

Sukumar is all set to start pushpa shooting from the second week of May

పుష్ప సినిమా విషయంలో సుకుమార్ ఎంత కసిగా ఉన్నారో తాజా సన్నివేశం చెబుతోంది. ఓవైపు ఏడాది కాలంగా వెంటాడి వేధిస్తున్న కోవిడ్ ని కేర్ చేస్తే అది నెత్తికెక్కి శివతాండవమాడుతుందని సుక్కూ భావిస్తున్నాడు. కరోనాతో సహజీవనాన్ని చాలామంది ప్రముఖులు ధృవీకరించిన నేపథ్యంలో అతడు ఫైటింగుకే సిద్ధమైనట్టు కనిపిస్తోంది.ఇటీవల పుష్ప సెట్లో కరోనా భారిన పడిన బన్ని ఇప్పటికే చికిత్సతో కోలుకుంటున్నారు. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ సెట్ నుంచి షూట్ లో పాల్గోనని వెళ్లారు. అయినా కానీ మే రెండో వారం నుంచి పుష్ప షూటింగుని ప్రారంభించేయనున్నాడట సుక్కూ. ఇప్పటికే హైదరాబాద్ ఔటర్ లో విలేజ్ సెట్ నిర్మిస్తున్నారని.. గిరిజన గ్రామాల షూట్ ని ఇక్కడే చేస్తారని చెబుతున్నారు.

గంధపు చక్కల స్మగ్లర్ కథాంశం... గిరిజన గ్రామాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది కాబట్టి విలేజ్ సెట్స్ ని నిర్మించి అందులోనే పుష్ప పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేస్తారట. ఇందులో రష్మిక గిరిజన యువతిగా నటిస్తుండగా.. తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ బన్నీకి సోదరిగా కనిపిస్తుంది. ఫహద్ విలన్ గా కనిపిస్తారు. ఊర్వశి రౌతేలా ఐటెమ్ నంబర్ ఓ రేంజులో ఊపేయడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే రింగ రింగా రేంజులో దేవీశ్రీ బాణీని రెడీ చేస్తున్నాడన్న కథనాలొచ్చాయి.