లుంగీలతో దర్శనమివ్వడం కోలీవుడ్ హీరోల సంప్రదాయం. తెలుపు లుంగీ..షర్ట్ లో వేదికలపై తళుక్కున మెరవడం అక్కడ హీరోల ప్రత్యేకత. సూపర్ స్టార్ రజనీకాంత్ వరకూ నేటి తరం యంగ్ హీరోల వరకూ ఎన్నోసార్లు వేదికలపై లుంగీ దుస్తుల్లో కనిపించారు. అక్కడ ఈ సంప్రదాయం పాతదే అయినా మిగతా భాషలకు కొత్తదనమే. సినిమాకు అదో రకమైన పబ్లిసిటీ లాగా కలిసొస్తుంది.
టాలీవుడ్ లో ఈ కల్చర్ లేదు. అంతా జీన్స్ ధరించి ముస్తాబయ్యేవారు .మరి మన హీరోలు ఎవరైనా కనీసం ఇంట్లోనైనా లుంగీలు ధరిస్తారా? అంటే అలాంటి హీరో ఒకరున్నారని తెలుస్తోంది. అతనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
డే ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి లుంగీలోకి దూరిపోతారుట. ఇంట్లో ఉన్నంత సేపు జీన్స్ లో ఉన్నా? సాయంసంధ్య వేళ తప్పకుండా లుంగీ ధరిస్తారుట.
అందులోనూ తెల్ల లుంగీ ధరించడం అంటే ఇంకా ఆసక్తి అట. ఆ రకంగా తనని ఈ కాలం అబ్బాయిలతో అస్సలు పోల్చవద్దు అంటున్నారు. ఇష్టమైన డ్రెస్ ఏంటంటే? షర్ట్..టీషర్ట్..జీన్స్ బ్రాండెడ్ వేర్ ఇలా ఏవోవో చెబుతుంటారు. కానీ అవి చరణ్ చాలా పరిమితంగానే వాడతారుట. 'రంగస్థలం' కథ చెప్పడాని దర్శకుడు సుకుమార్ చరణ్ ఇంటికెళ్లినప్పుడు ఆ సమయంలో లుంగీలోనే కూర్చున్నారుట.
తన ఇష్టం తెలుసుకుని సుకుమార్ 'రంగస్థలం'లో లుంగీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారుట. చరణ్ సోదరి రంగస్థలం కోసం రకరకాల లుంగీలు డిజైన్ చేసినట్లు తెలిపారు. అలాగే లుంగీపై మ్యాచింగ్ తువాళ్లు కూడా తన సోదరే స్వయంగా డిజైన్ చేసారుట. ఆ సినిమాలో తాను వినియోగించిన పంచెలకు.. తువాళ్లకు మార్కెట్ లో మంచి గిరాకీ కూడా ఉందని చరణ్ నవ్వేసారు.
ఇక చరణ్ కెరీర్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆస్కార్ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' కి ఆస్కార్ వచ్చిన ఉత్సాహంలో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ తో చరణ్ కి హాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 లో నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.