సుకుమార్ మల్టీవర్స్ ప్లాన్.. పుష్ప 2లో మరో హీరో?

Fri Dec 09 2022 16:30:37 GMT+0530 (India Standard Time)

Sukumar Planning For Multistarrer in Pushpa2 Film

సినిమాటిక్ యూనివర్స్ అనేది ఇటీవల కాలంలో చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. కేవలం హాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా వివిధ ఇండస్ట్రీలలో చాలామంది దర్శకులు ఆ తరహా కథలను రెడీ చేసేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. స్టార్ దర్శకులు చిన్నదర్శకులని తేడా లేకుండా ఇప్పుడు కంటెంట్ వర్కౌట్ అయితే అన్ని వర్గాల దర్శకులు కూడా ఈ తరహా కాన్సెప్ట్ ఫాలో అయ్యేందుకు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు.ఇప్పటికే లోకేష్ కనగరాజ్ మల్టీవర్స్ ప్లాన్ రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో అయితే ఇటీవల హిట్ 2 దర్శకుడు  శైలేష్ కొలను హిట్టు సినిమా ద్వారా మల్టీపర్స్ ప్లాన్ కు ఒక స్టేజ్ అయితే సెట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సుకుమార్ కూడా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్లుగా మరొక కొత్త టాక్ వినిపిస్తోంది.

పుష్ప పార్ట్ 1 సక్సెస్ కావడంతో ప్రస్తుతం పుష్పా సెకండ్ పార్ట్ భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ క్రియేటివ్ దర్శకుడు ఈ కథలోని క్లైమాక్స్ లో మరొక హీరోను రంగంలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకోసం రంగస్థలం చిట్టిబాబుని రంగంలోకి దింపే ఛాన్స్ కూడా ఉన్నట్లు కూడా ఒక కొత్త టాక్ వైరల్ గా మారింది. రెండు కూడా 80 90 ల కాలంలో జరిగిన కథలు కాబట్టి వాటికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటాడు అని ఉదాహరణ కూడా వైరల్ గా మారింది.

పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత రామ్ చరణ్ తో సుకుమార్ మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. బహుశా పుష్ప సెకండ్ పార్ట్ నుంచి మళ్లీ చరణ్ చేయబోయే కథను కూడా లింక్ చేసే అవకాశం లేకపోలేదు.

తప్పకుండా పుష్ప సెకండ్ పార్ట్ లో ఒక సర్ ప్రైజ్ ఉంటుంది అని గతంలోనే హీరోతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా చాలా బలంగా చెప్పారు. కాబట్టి ఇది మల్టీవర్స్ ప్లాన్ అనిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ తప్పకుండా నిజమైతే మాత్రం మరొక రేంజ్ లో ఉంటుంది అని చెప్పవచ్చు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.