దసరాకు సుకుమార్ సినిమా లాంచ్ కాలేదే!

Wed Oct 09 2019 18:35:45 GMT+0530 (IST)

Sukumar And Allu Arjun Movie Not Launched During Dussehra

'రంగస్థలం' తో సుకుమార్ సాధించిన విజయం సాధారణమైనది కాదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్ట్ తో హిట్ కొట్టడం కష్టం కాదు కానీ 'రంగస్థలం' లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆ పని చేయడమే కష్టం.  అయితే అలాంటి సినిమా తర్వాత వెంటనే సుకుమార్ కు సినిమా సెట్ కాలేదు.  మహేష్ బాబుతో సినిమా సెట్ అయింది కానీ అది క్యాన్సిల్ కావడంతో అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసుకున్నాడు.  అయితే ఈ సినిమాను ఎంతకూ లాంచ్ చేయకపోవడంతో సుక్కు అభిమానులకు నిరాశ తప్పడం లేదు.అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 'అల వైకుంఠపురములో' సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా జనవరిలో రిలీజ్ కానుంది. దీంతో బన్నీ - సుకుమార్ సినిమాను దసరాకు లాంచ్ చేస్తారని.. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని కొన్నివార్తలు కూడా వచ్చాయి.  అయితే దసరా వచ్చింది.. పోయింది.. సుక్కు - బన్నీ సినిమా మాత్రం లాంచ్ కాలేదు.  దీంతో సుక్కు అభిమానులలో ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే సుకుమార్ సన్నిహితులు మాత్రం ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. దేవీశ్రీ ప్రసాద్ ట్యూన్స్ చేయడం కూడా ప్రారంభించాడని అంటున్నారు.  'అల వైకుంఠపురములో' రిలీజ్ కాగానే ఈ సినిమాను లాంచ్ చేస్తారని.. ఎక్కువ గ్యాప్ లేకుండా సెట్స్ పైకి తీసుకెళ్తారని అంటున్నారు.