'సెల్ఫిష్' కోసం సుకుమార్ ఏ టు జడ్

Sat Jan 29 2022 07:00:02 GMT+0530 (India Standard Time)

Sukumar A to Jud for Selfish

సుకుమార్ పుష్ప సినిమా తో మరోసారి తన సత్తా చాటాడు. మాస్టర్ మైండ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న సుకుమార్ పుష్ప పార్ట్ 2 పనిలో బిజీ అవ్వబోతున్నాడు. డిసెంబర్ లోనే పుష్ప పార్ట్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన నిర్మాణ సంస్థలో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటి వరకు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో నిర్మించిన సినిమాలకు కథ విషయంలో మరియు స్క్రీన్ ప్లే విషయంలో సలహాలు సూచనలు ఇచ్చేవాడు. కాని తాజాగా మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్న సెల్ఫిష్ మూవీ కోసం సుకుమార్ ఏ టు జడ్ అంటే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుకుని ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు సలహాలు సూచనలు చేయబోతున్నాడట. దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోతున్న ఈ సెల్ఫిష్ ను సుకుమార్ సమర్పించేందుకు ఓకే చెప్పాడు.తనకు దర్శకుడిగా దిల్ రాజు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరి కాంబోలో సినిమా లు రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు దిల్ రాజు తో కలిసి సుకుమార్ వర్క్ చేసేందుకు సిద్దం అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉంది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన సారధ్యంలో దిల్ రాజు తమ ఇంటి వారసుడు అయిన అశ్విన్ తో సినిమా ను చేయాలని భావిస్తున్నాడట. అశ్విన్ మొదటి సినిమా రౌడీ భాయ్స్ కి భారీగా ఖర్చు చేశారు. కాని సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దాంతో ఈసారి దర్శకుడు సుకుమార్ భాగస్వామ్యంతో ఆయన సారధ్యంలో సినిమాను చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. అందుకోసం సుకుమార్ తో భారీ మొత్తానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

కథ నుండి మొదలుకుని అన్ని విషయాలను కూడా సుకుమార్ ఆధ్వర్యంలో ఆయన ఇష్టానుసారంగానే కానిచ్చేలా ఇద్దరి మద్య ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాడు. అందుకే ఈ సినిమా కు భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అశ్విన్ కు ఎట్టిపరిస్థితుల్లో భారీ విజయాన్ని కట్టబెట్టే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్ మరియు దిల్ రాజులు బలంగా తల్చుకున్నారు కనుక సెల్ఫిష్ ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంటాడనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. ఈ సినిమా ను ఇదే ఏడాది లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

దిల్ రాజు ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ మరియు శంకర్ మూవీని ఇంకా విజయ్ మరియు వంశీ పైడిపల్లి మూవీని నిర్మిస్తున్నాడు. ఇదే సమయంలో కొత్త హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదిలో మరియు వచ్చే ఏడాది లో దిల్ రాజు నుండి రాబోతున్న సినిమా లు చాలా ప్రత్యేకంగా ఉంటాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇక సుకుమార్ విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 తో ఒక సునామి సృష్టించాడు. పార్ట్ 2 తో అంతకు తగ్గకుండా మరో సునామి సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.