#గుసగుస: ఖాన్ వారసురాలు ఫ్యాషన్ సెన్స్ ఫ్లాప్

Tue Jan 24 2023 06:00:05 GMT+0530 (India Standard Time)

Suhana Khan's fashion sense flops

షారూఖ్ ఖాన్ గారాల పట్టీ సుహానాఖాన్ (22) డెబ్యూ నాయికగా ది ఆర్చీస్ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గల్లీ బోయ్ ఫేం జోయా అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. సుహానా నటిగా సత్తా చాటాలనుకుంటోంది. తండ్రిని మించిన తనయగా నిరూపించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది. అంతేకాదు సోషల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ సంపాదించేందుకు రకరకాల ఎత్తుగడలను అనుసరిస్తోంది. ఖాన్ వారసురాలు ఎక్కడ కనిపించినా యూనిక్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది.  ఇటీవలి కాలంలో సుహానా ఫ్యాషన్ గేమ్ అమాంతం ఛేంజ్ అయ్యింది.ఇటీవల సుహానా ఎయిర్ పోర్ట్ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు దుబాయ్ పార్టీలో తన లేటెస్ట్ లుక్ పై మాత్రం అభిమానులు సంతృప్తిగా లేరు. సుహానా ఖాన్ డీప్ నెక్ తో డిజైన్ చేసిన చిట్టిపొట్టి పింక్ ఫ్రాక్ ధరించినా ఈ లుక్ ఏమంత ఆకట్టుకోకపోగా ట్రోలింగుకి గురైంది.

సుహానా ఖాన్ తన స్నేహితురాలు షానాయ కపూర్ తో కలిసి ఇటీవల సూపర్ మోడల్ - అమెరికన్ సోషలైట్ కెండల్ జెన్నర్ తో కలిసి పార్టీకి హాజరైంది. ఈ పార్టీ నుండి తాజా ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. యువ డెబ్యూ నాయికలు చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చినా ఆ ఇరువురిలో సుహానా లో ప్రొఫైల్ లో కనిపించడం అభిమానుల నిరాశకు కారణం.

సుహానా అభిమానుల్లో కొందరు ఈ లుక్ పై ప్రేమను కురిపించగా నెటిజన్లలో ఒక వర్గాన్ని ఈ లుక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఫోటోని వీక్షించగానే 'సుహానా డిజాస్టర్ లుక్ ఇది' అని ఒకరు కామెంట్ చేసారు. 'సుహానాకు నిజంగా మంచి హెయిర్ స్టైలిస్ట్ కావాలి' అని మరొకరు సూచించారు.

ఇంతకీ ఈ పార్టీ ఎక్కడ జరిగింది? అంటే.. ఆకాశహార్మ్యాల దుబాయ్ లో జరిగింది. గౌరీ ఖాన్- షానాయ కపూర్ లతో కలిసి దుబాయ్ ఈవెంట్ నుండి త్రోబాక్ ఫోటోలను షేర్ చేసారు. గులాబీ రంగు డిజైనర్ ఫ్రాకుతో పాటు బ్లాక్ కలర్ ఫ్రాకులోను సుహానా కనిపించగా తన తల్లి గౌరీ ఖాన్ సింపుల్ డిజైనర్ లుక్ లో కనిపించారు. తల్లీకూతుళ్లిద్దరూ దుబాయ్ లో పార్టీలో ఫుల్ గా ఆస్వాధించి ఆదివారం నాడు తిరిగి ముంబైకి వచ్చారు.

పార్టీ నైట్ లో సుహానా ఖాన్ - గౌరీ ఖాన్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక హోటల్ లాంచ్ పార్టీకి హాజరయ్యారు. సుహానా పొట్టి పింక్ డ్రెస్ లో కనిపించగా.. గౌరి బ్లాక్ గౌనులో కనిపించారు. ఈ పార్టీలో సుహానా బెస్ట్ ఫ్రెండ్ షానాయ కపూర్ సన్నిహితంగా కనిపించింది.  ఇక దుబాయ్ నైట్ పార్టీలో కెండల్ జెన్నర్ తో సుహానా ఖాన్ - షానయా కపూర్ బంధం చూపరులను ఆకర్షించింది.

7 స్టార్ హోటల్ లాంజ్ లో జరిగిన బ్లూ కార్పెట్ ఈవెంట్ కు సుహానా ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఈ పార్టీ నుండి ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై సుహానా మరో స్నేహితురాలు అనన్య పాండే 'అందమైన అమ్మాయి సుజీ' అని వ్యాఖ్యానించింది. అనన్య తల్లి భావన పాండే కూడా కామెంట్స్ విభాగంలో హార్ట్ ఎమోజీలను ఫైర్ ఎమోజీలను షేర్ చేసారు. నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావు నా ప్రియతమా! అంటూ కోయెల్ పూరి ప్రశంసించారు. చాలా మంది అభిమానులు కూడా ఆమె లుక్స్‌ని మెచ్చుకున్నా కొందరు అభిమానులు లుక్ అంతగా నచ్చలేదని వ్యాఖ్యానించారు.

దుబాయ్ పార్టీ ముగించాక.. ఆదివారం సాయంత్రం గౌరీ -సుహానా ముంబై విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు పూర్తి భిన్నంగా కనిపించారు. సుహానా పొట్టి బ్లూ టాప్ - బ్లాక్ ప్యాంట్ లో కనిపించగా గౌరీ ప్రింటెడ్ హూడీ - వైట్ ప్యాంట్ లో కనిపించింది. పార్కింగ్ లో కార్ వద్దకు వెళ్లే సమయంలో ఈ జోడీని పలువురు ఫోటోగ్రాఫర్ లు అభిమానులు చుట్టుముట్టారు. కానీ వారు మీడియాకు పోజులివ్వలేదు.. కనీసం మాట్లాడలేదని కూడా తెలిసింది.

సుహానా ఈ ఏడాది తన తొలి చిత్రం 'ది ఆర్చీస్'లో కనిపించనుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సుహానా వెరోనికా అనే పాత్రలో నటించింది. జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ - అమితాబ్ మనవడు.. శ్వేతా నందా కుమారుడు అగస్త్య నంద కూడా ఇందులో నటిస్తున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.