Begin typing your search above and press return to search.
విశ్వనటుడు కమల్ హాసన్ పైనే కౌంటర్ వేసాడు!
By: Tupaki Desk | 29 May 2023 9:43 AMవివాదాలతో బోలెడంత ప్రచారం కొట్టేసింది 'ది కేరళ స్టోరి'. అదా శర్మ- యోగితా బిహానీ- సిద్ధి ఇద్నానీ- సోనియా బలానీ ఇందులో తారాగణం. కేరళ స్టోరీ ఎంతగా ప్రశంసలు దక్కించుకుందో అంతకుమించి వివాదాలు చుట్టుముట్టాయి. కొందరు దీనిని 'ప్రచార చిత్రం' అని విమర్శించగా.. కేరళ పరువు తీసే చిత్రమని చాలా మంది ఆవేదన వ్యక్తం చేసారు.
ఇది ఇస్లామోఫోబియాను ప్రోత్సహిస్తోందని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. గత సాయంత్రం IIFA అవార్డ్స్ 2023 కోసం అబుదబీ- యాస్ ద్వీపానికి చేరుకున్న కమల్ హాసన్ 'ది కేరళ స్టోరి' ని ఒక ప్రచార చిత్రం అని పిలిచారు. అయితే విశ్వనటుడి వ్యాఖ్యలకు కౌంటర్ గా 'ది కేరళ స్టోరి' దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించారు.
కమల్ హాసన్ కేరళ స్టోరీని ప్రచార చిత్రంగా పేర్కొనడంపై సుదీప్తో సేన్ తనదైన శైలిలో స్పందించారు ఒక ప్రముఖ వార్తా పోర్టల్ తో మాట్లాడుతూ-''అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని.. అటువంటి ప్రకటనలపై తాను స్పందించడం మానేసాన''ని అన్నారు. ఇంతకుముందు సినిమాని ప్రచార చిత్రం అని పిలిచిన వారంతా మళ్లీ మళ్లీ సినిమాను చూసి తమ వైఖరిని మార్చుకున్నారని ఆయన అన్నారు. సినిమా చూసి బాగుంది అని అందరూ అన్నారు. సినిమా చూడని వారు విమర్శించడం బాలేదని సుదీప్తో సేన్ ఆవేదన వ్యక్తం చేసారు.
పశ్చిమ బెంగాల్- తమిళనాడు రాష్ట్రాలు సినిమాను చూడలేదని వీరంతా దీనిని ఒక ప్రొపగండా ప్రచార చిత్రంగా పేర్కొంటూ నిషేధం విధించారని ఆయన ఉదాహరించారు. ''మన దేశంలో చాలా మూర్ఖపు మూసలు ఉన్నాయి... జీవితం నల్లగా లేదా తెలుపుగా ఉండాలి. బూడిద రంగులో జీవితం ఉంటుందనేది వారికి తెలియదు'' అని కౌంటర్ వేసారు. సుదీప్తో సేన్ వరుస ప్రమోషన్ల కారణంగా డీహైడ్రేషన్ (వడదెబ్బ) ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు.
ది కేరళ స్టోరీ లో రాజకీయ కోణం!
ఈ సినిమా బీజేపీకి నచ్చిందంటే అది తమ సినిమా అని అర్థం కాదని సుదీప్తో సేన్ అంటున్నారు. అంతర్జాతీయంగా 37 దేశాల్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని సేన్ చెప్పారు. తమకు సందేహాలు వచ్చినా.. విమర్శలు వచ్చినా తనకు ఫోన్ చేస్తే క్లారిటీ ఇస్తున్నానని అన్నారు. సినిమాని క చూడకుండా అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా 'ప్రచార చిత్రం' అని పిలుస్తున్న వ్యక్తి కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నాడని ఆయన అన్నారు.
అలాంటి వారికి వివరణలు ఇవ్వడం మానేసినట్లు సేన్ చెప్పారు. ది కేరళ స్టోరీ పై బలంగా ఉన్న వివాదాల గురించి కమల్ హాసన్ ను ఐఫా2023 ఉత్సవాల్లో ప్రశ్నించారు. తాను ప్రచార చిత్రాలకు వ్యతిరేకమని.. నిజ కథను లోగోగా రాయడం వల్ల అది నిజమైన చిత్రం కాదని కమల్ హాసన్ అన్నారు. ఇది భాజపా వ్యతిరేక రాజకీయ ప్రకటన అని కొందరు విశ్లేషిస్తున్నారు.