Begin typing your search above and press return to search.

నిఖిల్ తో ఆ సీక్వెల్ నెక్స్ట్ లెవల్ అంటున్న డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   29 March 2023 11:05 AM GMT
నిఖిల్ తో ఆ సీక్వెల్ నెక్స్ట్ లెవల్ అంటున్న డైరెక్టర్..!
X
యువ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ సినిమాల మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు నిఖిల్. ఇప్పటికే స్పై సెట్స్ మీద ఉండగా కార్తికేయ 3 తో పాటుగా తన సూపర్ హిట్ సినిమా స్వామి రారా 2 మీద కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. స్వామిరారా డైరెక్టర్ సుధీర్ వర్మ ఆ సినిమా సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిఖిల్ తో స్వామిరారా 2 ఉంటుందని కాకపోతే దానికి కొంత టైం పడుతుందని అన్నారు. అంతేకాదు స్వామిరారా 2 తీస్తే మాత్రం అది నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అన్నారు.

రొటీన్ సినిమాలతో సతమతమవుతున్న నిఖిల్ కు డిఫరెంట్ సబ్జెక్ట్ తో హిట్ అందించిన సినిమా స్వామిరారా. ఓ రకంగా నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది ఈ సినిమాతో అని చెప్పొచ్చు. స్వామిరారా తర్వాతనే వరుస ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఆ క్రమంలోనే కార్తికేయ, కార్తికేయ 2 వచ్చాయి. కార్తికేయ 2 హిందీ వర్షన్ సూపర్ హిట్ అవడం నిఖిల్ కు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అందుకే కార్తికేయ 3 ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటుగా స్వామిరారా 2 ని కూడా అదే రేంజ్ లో మొదటి సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సెట్ చేస్తున్నారట డైరెక్టర్ సుధీర్ వర్మ.

ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో రావణాసుర సినిమా చేసిన సుధీర్ వర్మ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ స్వామిరారా 2 సినిమా గురించి చెప్పారు. స్వామిరారా 2 ఇంకా కథా చర్చల దశలోనే ఉందని.

కథ కుదిరితే తప్పకుండా గ్రాండ్ స్కేల్ లోనే ఆ సినిమా ఉంటుందని అన్నారు. ఆల్రెడీ స్వామిరారా 2 కోసం నిర్మాతలు తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నారని అన్నారు సుధీర్ వర్మ.

సో నిఖిల్ ఖాతాలో మరో క్రేజీ సీక్వెల్ రానుందని చెప్పొచ్చు. రవితేజ రావణాసుర హిట్ పడితే సుధీర్ వర్మ మళ్ళీ ఫాం లోకి వచ్చినట్టే. నిఖిల్ తో ఆల్రెడీ కేశవ సినిమా కూడా చేసిన సుధీర్ వర్మ స్వామిరారా 2 తీస్తే మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. నిఖిల్ కూడా ఇక మీదట తన సినిమాలన్ని కూడా పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.