బ్యాడ్మింటన్ రోజులు గుర్తు చేసుకుంటున్న మహేష్ బావ...!

Sun Jul 05 2020 20:00:51 GMT+0530 (IST)

Sudheer Babu Remembers His Childhood Days

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలను.. కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పరుచుకున్నాడు సుధీర్. 'ఏమాయ చేసావే' సినిమాలో చిన్న పాత్ర పోషించిన సుధీర్ 'ఎస్సెమ్మెస్' సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలను చేసుకుంటూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో 'ప్రేమ కథా చిత్రమ్' 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' 'భలే మంచి రోజు' 'భాగీ' 'శమంతకమణి' 'సమ్మోహనం' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. నానితో కలిసి నటించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు సుధీర్ బాబు ఛాంపియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని అందరికీ తెలిసిందే. అనేక జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ లలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు సుధీర్. కాగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సుధీర్ ఈ మధ్య ఓల్డ్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన లైఫ్ లో ప్రౌడ్ మూమెంట్ గా ఫీల్ అయ్యే ఓల్డ్ పిక్ ఒకటి పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో సుధీర్ బాబు మెడల్ అందుకుంటూ ఉన్నాడు. ఇది నేషనల్ స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ లో రన్నరప్ మెడల్ తీసుకుంటున్న సమయంలోనిదని సుధీర్ చెప్పుకొచ్చాడు. ఈ ఫోటో క్రెడిట్ మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ చేతన్ ఆనంద్ కి దక్కుతుందని సుధీర్ బాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు.