ఓటీటీకి సర్దేసుకుంటున్న సుధీర్ బాబు హంట్..

Tue Jan 31 2023 11:58:01 GMT+0530 (India Standard Time)

Sudheer Babu Hunt moving to OTT..

సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. గణతంత్ర దినోత్సవం రోజు విడుదలైన ఈ సినిమా రెండు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది. హంట్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఓ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. సుధీర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన 16 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ సినిమాలో సుధీర్ బాబు డిఫరెంట్ రోల్ చేశారు. స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన అలాంటి రోల్ చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఈ కఛ ప్రారంభించేముందు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని చిత్ర బృందం చాలా భయపడిపోయిందట. కానీ ఇప్పుడు సినిమా చూసిన వాళ్లంతా బాగుందని చెప్పడంతో చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించారు.

వి ఆనంద ప్రసాదం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ప్రేమిస్తే భరత్ మంజుల ఘట్టమనేని కీలక పాత్రలు పోషించారు. గతాన్ని మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ కథను మహేశ్ చాలా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు. దాదాపు తను సాల్వ్ చేసిన ఓ కేసును గతాన్ని మర్చిపోవడంతో మళ్లీ మొదలు పెట్టడం.. దాన్ని ఎలా టేకాఫ్ చేశాడనే పాయింట్ తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా సినిమాను తెరకెక్కించడం అందరికీ నచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ లేదు. అలాగే ఒకే ఒక్క పాట అది కూడా ఐటమ్ సాంగ్ మాత్రమే ఉంది.

మలయాళం వచ్చిన ముంబై పోలీస్ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం చాలా థ్రిల్లింగ్ ను ఇస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సుధీర్ బాబు చాలా కొత్తగా ట్రై చేశారు. సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంటున్నప్పటికీ... రీమేక్ అనే ముద్ర పడడంతో కాస్త ముందు నుంచే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.