మహేష్ ను చూస్తే ఏ అమ్మాయైనా అంతేనట!

Thu Aug 09 2018 17:03:40 GMT+0530 (IST)


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ సినిమా `మహర్షి` ఫస్ట్ లుక్ - టీజర్ ను ....ప్రిన్స్ బర్త్ డే గిఫ్ట్ గా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ ప్రిన్స్ అభిమానులతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకుంది. ముఖ్యంగా యంగ్ కాలేజ్ స్టూడెంట్ గా మహేష్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. తన బావ మహేష్ లుక్....హీరో సుధీర్ బాబుకు కూడా తెగ నచ్చేసింది. అందుకే ఆ లుక్ పై...టీజర్ పై సుధీర్ బాబు ఓ ఇంటరెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆ టీజర్ లో మహేష్ ను చూడగానే పక్కనున్న అమ్మాయి వెనక్కి తిరిగి చూడడంపై సుధీర్ ట్వీట్ చేశారు. ఆ  అమ్మాయి అంత నటించక్కర్లేదని మహేష్ ను చూడగానే ఏ అమ్మాయికైనా ఆ ఎక్స్ ప్రెషన్ సహజంగానే వచ్చేస్తుందని సుధీర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.మహేశ్ చేసే ప్రతీ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండేలా చూసుకుంటారని సుధీర్ అన్నారు. అయితే ‘మహర్షి’ ఫస్ట్ లుక్ తనను సర్ ప్రైజ్ చేసిందని - ఆ లుక్  ఫ్రెష్ గా - ఫ్లర్టేషియస్ గా ఉందని అన్నారు. అయితే - ఈ టీజర్ లో మహేశ్ పక్కనున్న అమ్మాయి వెనక్కి తిరిగి చూడడం తనకు సర్ ప్రైజింగ్ గా లేదని అన్నారు. ఆ అమ్మాయి అంత నటించక్కర్లేదని - మహేశ్ బాబును చూడగానే ఏ అమ్మాయి అయినా అలానే చేస్తుందని అన్నారు.  ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించలేని విధంగా సూపర్ స్టార్ లుక్ ను కొత్తగా చూపించారని - దర్శకుడు వంశీ పైడిపల్లికి కంగ్రాట్స్ అండ్ గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో....ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. అందులోనూ డిఫరెంట్ గా ఉన్న మహేశ్ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు.