నిర్మాత దరిద్రం పోగొట్టేలా దసరా దూకుడు

Thu Mar 30 2023 23:20:18 GMT+0530 (India Standard Time)

Sudhakar Cherukuri SLV Cinemas banner Dasara Movie

కొంతమంది నిర్మాతలు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ప్రారంభంలోనే భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేక ఆర్థికంగా నష్టపోతుంటారు. ఇలా చాలామంది నిర్మాతలు రెండు మూడు సినిమాలు తీసి ఇక వందల కోట్లు నష్టపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు.అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ సినిమాలు చేస్తూనే ఉంటారు. అలా టాలీవుడ్ లో తాజాగా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుధాకర్ చెరుకూరి కూడా ఉంటారు. సుధాకర్ చెరుకూరి ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై మొదటి చిత్రంగా బాలకృష్ణతో లయిన్ సినిమా చేశాడు.

అప్పటివరకు బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమాకి ఖర్చు పెట్టడం విశేషం. అయితే మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు సినిమా చేశారు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. తర్వాత శర్వానంద్ తో మళ్లీ ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా నిర్మించారు.

ఇది కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజతో రామారావు ఆన్ డ్యూటీ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ మూవీ కూడా రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా మారింది.

అలాగే రానాతో విరాటపర్వం అనే సినిమా నిర్మించి కమర్షియల్ గా మరో ఫ్లాప్ ని ఖాతాలో వేస్తున్నారు. ఇలా ఏకంగా ఆరు డిజాస్టర్ సినిమాలు తర్వాత ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో దసరా సినిమాని ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా నిర్మాతకి రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి లాంగ్ రాన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తుంది అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.