ఎన్టీఆర్ ని అలా నేనెప్పుడూ చూడలేదు..!

Sat Mar 18 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

Subhalekha Sudhakar comments on NTR

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటన గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల్లో నవరసాలను పండించగలిగే నటులలో తారక్ ముందుంటాడు. ఆర్.ఆర్.ఆర్ తో ఆయన గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రిపుల్ ఆర్ తో వరల్డ్ సినీ ఆడియన్స్ ని తన అభిమానులుగా మార్చుకున్నాడు ఎన్.టి.ఆర్. అయితే ఎన్.టి.ఆర్ నటన గురించి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న కొందరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. వారిలో ఒకరైన శుభలేఖ సుధాకర్.ఎన్.టి.ఆర్ గురించి ఆయన నటన గురించి శుభలేఖ సుధాకర్ ఒకప్పటి స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.. అప్పటిదాకా సరదాగా ఉండే తారక్ టేక్ అనగానే మూడ్ లోకి వచ్చి 3 4 పేజీల డైలాగ్ అవలీలగా చదువుతాడు. సింగిల్ టేక్ లో అన్ని పేజీల డైలాగ్ చెప్పేస్తాడు. ఆయన్ను ఎప్పుడూ సెట్ లో డైలాగ్ పేపర్ చూసుకోవడం చూడలేదని అన్నారు శుభలేఖ సుధాకర్. కెమెరా కోసమే ఆయన పుట్టాడని అనిపిస్తుంది. సినిమా పట్ల ఆయనకు ఉన్న కసి కృషి వల్లే ఇదంతా అని అన్నారు. తారక్ వండర్ కిడ్ అంటూ ఎన్.టి.ఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు శుభలేఖ సుధాకర్.

రీసెంట్ గా ధంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎన్.టి.ఆర్ గురించి విశ్వక్ సేన్ కూడా ఇదే రేంజ్ లో పొగిడాడు. ఎన్.టి.ఆర్ ని మించిన నటుడు ఇండియాలోనే ఎవరు లేరని విశ్వక్ సేన్ అనడం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఒక హీరో అయ్యుండి ఎన్.టి.ఆర్ మీద విశ్వక్ చూపించిన అభిమానం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ని మెప్పించింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో జావి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ నెల చివరన పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ రేంజ్ మరింత పెరిగింది. ఎన్.టి.ఆర్ 30తో నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ పై తన ముద్ర వేయాలని చూస్తున్నారు తారక్.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.