టాలీవుడ్ లో అరడజను మంది స్టార్లకు ఆవిడే స్టైలిష్ట్

Sun Oct 18 2020 21:30:05 GMT+0530 (IST)

Stylist Harmann Kaur has a long experience as a celebrity stylist

స్టార్లకు స్టైలింగ్ చేయడం అంటే అదో సవాల్ లాంటిదే. కోట్లాది మంది మెప్పు పొందేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అంతంత మాత్రమే అందమే ఉన్నా.. గొప్ప స్మార్ట్ అప్పియరెన్స్ తేవాల్సి ఉంటుంది. అందుకే స్టైలిష్ట్ లతో వ్యవహారం చాలా కాస్ట్ లీగానే ఉంటుంది. ఐఐటీల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేసి వచ్చి సెలబ్రిటీ ప్రపంచంలో పాపులరైన వాళ్లలో ఎందరో ఉన్నారు.ఇక స్టైలిష్ట్ హర్మాన్ కౌర్ సెలబ్రిటీ స్టైలిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న పర్సనాలిటీ. టాలీవుడ్ లో ఏకంగా డజను మందికి స్టైలిష్ట్ గా పని చేస్తున్నారు. అల్లు అర్జున్-విజయ్ దేవరకొండ- రానా దగ్గుబాటి- రష్మిక మందన- ప్రణీత సుభాష్ ఇలా ఎందరికో ఆవిడే స్టైలిష్ట్. వారి గురించి ఆసక్తికరమైన రహస్యాలను ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి బంగారు ఆభరణాలు ధరించడం అంటే అంత ఆసక్తి ఉండదని ఇదివరకూ వెల్లడించారు ఆమె. పాశ్చాత్య దుస్తులలో అందంగా కనిపించేలా రష్మిక మందన శైలి మార్చి చూపించారు హర్మాన్. రష్మికతో పనిచేయడం ఖచ్చితంగా ఒక ట్రీట్ లాంటిదని.. ఆమె డిజైనర్ దుస్తుల రంగుల నమూనాలను క్రమబద్ధీకరించడం .. అప్పుడప్పుడు జాకెట్ ధరించడం వంటి ప్రాధాన్యతలతో అందం రెట్టింపైందని హర్మాన్ తెలిపారు.

అల్లు అర్జున్ - రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప కోసం హర్మాన్ స్టైలింగ్ చేస్తున్నారు. నాయకానాయికలకు తనే డిజైనర్. ఇటీవలి ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఎక్కువగా నలుపు రంగును ఇష్టపడతారని అతను ఎంచుకున్న రంగుల గురించి చాలా క్లారిటీగా చెప్పారు హర్మాన్. పరిశ్రమలో టాప్ రేంజ్ నటీనటుల అభిరుచుల మేరకు ఆమె డిజైనింగ్ ట్రీట్ స్టైలింగ్ ట్రీట్ ఎలా చేస్తున్నారో వెల్లడించారు. స్టార్ల ఛాయ అభిరుచుల్ని బట్టి ఎంపికలు ఉంటాయని వెల్లడించారు.