Begin typing your search above and press return to search.

స్టైల్ ఐక‌న్ సారా అలీఖాన్.. అంత ఛీప్ గానా?

By:  Tupaki Desk   |   24 Feb 2021 5:30 AM GMT
స్టైల్ ఐక‌న్ సారా అలీఖాన్.. అంత ఛీప్ గానా?
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సురాళ్ల ల‌గ్జ‌రీ లైఫ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. కింగ్ ఖాన్ షారూక్ వార‌సురాలు సుహానా ఖాన్.. అనన్య పాండే.. స‌న‌య‌.. న‌వ్య న‌వేళీనందా వీళ్లంతా ఒక గ్రూప్. ఈ భామ‌లంతా కాస్త ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ తో క‌నిపిస్తారు. అలాగే జాన్వీక‌పూర్ - ఖుషీ కపూర్ అల్ట్రా స్టైలిష్ లుక్ కోసం కాస్త ఖ‌ర్చు ఎక్కువే చేస్తుంటారు.

కానీ సైఫ్ అలీఖాన్ న‌ట‌వార‌సురాలు సారా అలీఖాన్ అలాకాదు. వీళ్ల‌తో పోలిస్తే చాలా డిఫ‌రెంట్. ప‌టౌడీ సంస్థానం వార‌సురాలు అయినా కానీ సారాలో కించిత్ గ‌ర్వం క‌నిపించ‌దు. అలాగే అన‌వ‌స‌ర‌మైన హంగామా కూడా ఏమాత్రం క‌నిపించ‌నివ్వ‌దు. గ‌ర్వం త‌న‌లో అస్స‌లు చూడ‌లేం. పైగా హ్యుమానిటీ అనే యాంగిల్ క‌నిపిస్తుంటుంది. ఇంత‌కుముందు విమాన ప్ర‌యాణం ముగించి ఎయిర్ పోర్ట్ లో వ‌స్తున్న‌ప్పుడు త‌న డ్రైవ‌ర్ కి ప‌ని అప్ప‌గించేయ‌కుండా త‌న సూట్ కేసు తానే మోసుకుంది. ఆ విజువ‌ల్స్ వైర‌ల్ అయ్యాయి. ఆ ఒక్క సంద‌ర్భ‌మే కాదు ఏదైనా ఇంట‌ర్వ్యూలో చిట్ చాట్ లో సారా వ్య‌క్తిత్వం సింప్లిసిటీ హైలైట్ గా క‌నిపిస్తాయి.

ఇక స్టైల్స్ అండ్ ట్రెండ్స్ లోనూ సారా ఎంతో సింపుల్ సెలెక్ష‌న్ కే ప్రాధాన్య‌త‌నిస్తుంది. ఆ విష‌యాన్ని తానే ఓ ఇంట‌ర్వ్యూలో లేటెస్టుగా వెల్లడించింది. రానున్న‌ది స‌మ్మ‌ర్ కాబ‌ట్టి.. నేటిత‌రం చాలా త‌క్కువ ఖ‌రీదుతో స‌మ్మ‌ర్ వ‌స్త్రాల్ని ఎలా ఎంపిక చేయాలి? అన్న‌దానిపై సారా స్పెష‌ల్ క్లాస్ ఇచ్చింది. సారా స‌మ్మ‌ర్ కోసం ఎంపిక చేసే దుస్తులు కేవ‌లం రూ. 500-1000 రేంజులోనివేన‌ట‌.

అయితే ఫ‌లానా బ్రాండ్ లో వెతికితే ఇలాంటివి దొరికేస్తాయ‌ని సారా అంటోంది. నిజానికి వేల‌కు వేలు పోసి ఖ‌రీదైన దుస్తులు కొనాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎంత చెట్టుకు అంత గాలి! అన్న చందంగా త‌మ స్థాయికి త‌గ్గ ఖ‌ర్చు చేసేవాళ్లు మాత్ర‌మే ఈ సొసైటీలో నిల‌బ‌డ‌గ‌ల‌రు. ఖ‌ర్చులో అదుపు త‌ప్పితే ఇక అదోగ‌తే! అన్న పాయింట్ ని సారా ఇలా కూడా చెబుతోంద‌న్న‌మాట‌!