పింక్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపించిన సన్నీ..!

Fri May 26 2023 11:55:46 GMT+0530 (India Standard Time)

Stunning Looks Of Sunny Leone In Pink Dress

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ ఏడాది మన భారతీయ తారలు చాలా మంది మెరిశారు. ఐశ్వర్యా రాయ్ సారా అలీఖాన్ మృణాల్ ఠాకూర్ ఈషా గుప్తా మానుషీ చిల్లర్ ఊర్వశీ రౌతెలా అమీ జాక్సన్  వంటి తారలు  రెడ్ కార్పెట్ పై నడిచారు. కాగా తాజాగా సన్నీ లియోన్ కూడా రెడ్ కార్పెట్ పై హొయలుపోయింది. తాను కేన్స్ లో గడిపిన క్షణాలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం విశేషం.బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనురాగ్ కశ్యప్తో కెన్నెడీ స్క్రీనింగ్లో రాహుల్ భట్తో కలిసి రెడ్ కార్పెట్ అందంగా నడిచింది. సన్నీ లియోన్ రిస్క్ హిప్-హై స్లిట్ బ్లష్ పింక్ కలర్  గౌను ధరించింది. ఈ డ్రెస్ లో సన్నీని చూడటానికి రెండు కళ్లు సరిపోవనిపించేలా ఉంది.

ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్టు కూడా పెట్టారు. తన కెరీర్ లో  గర్వించదగిన విషయం ఇది అంటూ ఆమె పేర్కొనడం విశేషం. తనకు ఈ అవకాశం వచ్చేలా చేసిన అనురాగ్ కశ్యప్ కి ఆమె ఈ సందర్భంగా దన్యవాదాలు తెలియజేశారు.

ఈ అందమైన ప్రదర్శనలో మీతో స్క్రీన్  ను పంచుకోవడానికి తనను అనుమతించినందుకు రాహుల్ భట్ కి కూడా ఆమె దన్యవాదాలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆమె స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు. సన్నీతో పాటు ఆమె భర్త డానియల్ వెబర్ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు

కాగా తాను పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతున్నానంటూ ఆమె ప్రదర్శన అనంతరం పేర్కొనడం గమనార్హం. ఇక్కడి వరకు రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడం గమనార్హం.

ఒకప్పుడు సన్నీ నిజంగానే అందరికీ పోర్న్ సినిమాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్ తారగా తన గుర్తింపు మార్చుకున్నారు. తెలుగులోనూ రెండు సినిమాల్లో ఆమె కనిపించడం విశేషం. ఇక సన్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె అందాన్ని ఆరాధించేవారు కొన్ని కోట్లలో ఉండి ఉంటారు.