Begin typing your search above and press return to search.

సినిమా కోసం జీవితాంతం తోడు లేకుండా తేజ‌స్వీ ప్ర‌యాణం!

By:  Tupaki Desk   |   15 Aug 2022 10:00 AM GMT
సినిమా కోసం జీవితాంతం తోడు లేకుండా తేజ‌స్వీ ప్ర‌యాణం!
X
విజ‌య‌వాడ బ్యూటీ తేజ‌స్వీ మ‌డివాడ సుప‌రిచియ‌తే. 'సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు'తో తెరంగేట్రం చేసిన బ్యూటీ అటుపై 'మ‌నం'..'హార్ట్ ఎటాక్' చిత్రాల్లో స‌పోర్టింగ్ రోల్స్ తో మెప్పించింది. కానీ ఆవేవి అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు. అదే స‌మ‌యంలో సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ దృష్టిలో ప‌డింది. తేజ‌స్వీతో వ‌ర్మ తెర‌కెక్కించిన 'ఐస్క్రీమ్' తో వెలుగులోకి వ‌చ్చింది.

వ‌ర్మ క్రియేటివిటీని అందుకుని పెర్పార్మెన్స్ చేయ‌డంలో త‌న‌దైన మార్క్ వేసింది. అప్ప‌టి నుంచి ఐస్ క్రీమ్ బ్యూటీగా పాపురల‌ర్ అయింది. ఆ త‌ర్వాత కొన్నాళ్ల పాటు వ‌రుస‌గా స‌పోర్టింగ్ రోల్స్ తో మెప్పించింది. కానీ ఇదంతా అమ్మ‌డు తెర‌పై క‌నిపించిన తీరుకు మాత్ర‌మే గుర్తింపు ద‌క్కింది. న‌టిగా మాత్రం ముద్ర‌ని వేయ‌లేక‌పోయింది.

ఈ క్ర‌మంలో చాలాకాలం పాటు గ్యాప్ త‌ప్ప‌లేదు. కొన్నాళ్ల‌గా ఎలాంటి అవ‌కాశాలు లేకుండా ఖాళీగానే ఉంది. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ లో అవ‌కాశం వ‌చ్చి వెళ్ల‌డంతో ఇంకాస్త పాపుల‌ర్ అయింది. తాజాగా తేజ‌స్వీ ప్ర‌ధాన పాత్ర‌లో 'క‌మిట్ మెంట్ 'చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమా ప్రమోష‌న్ లో భాగంగా అమ్మ‌డు వృత్తి..వ్య‌క్తిగ‌తానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

"క‌మిట్ మెంట్ వాస్త‌వ క‌థ‌తో తెర‌కెక్కింది. క‌థ విన్న‌ప్పుడు నాకు ఎదురైన చాలా సంఘ‌ట‌నలు సినిమాలో ఉన్న‌ట్లు అనిపించింది. ఈ క‌థ‌కు క‌నెక్ట్ అవ్వ‌డానికి అదే కార‌ణం. నాలుగు క‌థ‌ల‌తో తెర‌కెక్కిన క‌మిట్ మెంట్ లో నాదొక క‌థ‌. స‌హ‌జ‌మైన క‌థ‌..పాత్ర కావ‌డంతో ఈ సినిమా తో నేను అనుకున్న‌వ‌న్ని నిజ‌మ‌వుతాయ‌న్న న‌మ్మకం ఉంది' అంటోంది.

ఇక సినిమా అనే మ‌జిలీ కోసం అమ్మ‌డు చాలా కోల్పోయిన‌ట్లు కూడా రివీల్ చేసింది. ఇంట్లో పెళ్లి చేసుకోమ‌న్నా చేసుకోవ‌డం లేదుట‌. ఒక‌వేళ వివాహం చేసుకుంటే మాత్రం వెంట‌నే సినిమాలు మానేయ‌ల‌ని కుటుంబ స‌భ్యులు కండీష‌న్ పెట్టారుట‌. దీంతో పెళ్లి అనే ఆలోచ‌నే మ‌న‌సులో నుంచి తొల‌గించిందిట‌ల. అందుకే ఇంత వ‌ర‌కూ పెళ్లి చేసుకోలేద‌ని..ఇక‌పై చేసుకునే ఆలోచ‌న కూడా లేద‌ని తెలిపింది.

సినిమాపై వ్యామోహం అలాంటింది. ఇండ‌స్ర్టీకి స‌క్సెస్ అవ్వాల‌ని ఎంతో మంది వ‌స్తుంటారు. అందులో కొంత మంది స‌క్సెస్ అవుతారు. మ‌రికొంత మంది ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మై తిరిగి ఇంటికెళ్లిపోతుంటారు. ఇక స‌క్సెస్ కానంత వ‌ర‌కూ ఇండ‌స్ర్టీ క‌ష్టాల క‌డ‌ల‌ని ఈదాల్సిందే. స‌క్సెస్ వ‌చ్చే వ‌ర‌కూ క‌మిట్ మెంట్ తో ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే.

ఆ విజ‌యం చెంత చేరిన నాడే ఆ క‌ష్టాల‌కు పుల్ స్టాప్ ప‌డేది. అంత వ‌ర‌కూ ఇండ‌స్ర్టీ సావ‌సం త‌ప్ప‌దు. తేజ‌స్వీ సైతం ఇదే క‌మిట్ మెంట్ తో ముందుకెళ్తుంది. మ‌రి క‌మిట్ మెంట్ తోనైనా తాను అనుకున్నవ‌న్నీ జ‌ర‌గాల‌ని ఆశిద్దాం.