పిక్ టాక్ : నువ్వ అలా ఒల్లు విరుస్తుంటే మా గుండె జారుతుంది అమ్మడు

Sat Oct 01 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Stunning Beauty Ketika Sharma

ఢిల్లీ ముద్దుగుమ్మ కేతిక శర్మ అందాల ఆరబోత విషయంలో స్టార్ హీరోయిన్స్ ను సైతం బీట్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలు ఇతర హీరోయిన్స్ తో పోల్చితే ఒకింత ఎక్కువే అంటూ అభిమానులు నెటిజన్స్ రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. చేసిన సినిమాలు తక్కువే.. సక్సెస్ లు అసలే లేవు. అయినా కూడా జోరు మాత్రం మామూలుగా లేదు.ఈ అమ్మడు తెలుగు లో గత ఏడాది రొమాంటిక్ సినిమా తో అడుగు పెట్టింది. పూరి ఆకాష్ తో టైటిల్ కి తగ్గట్లుగానే చేసిన ముద్దుగుమ్మ కేతిక శర్మ ఆ తర్వాత వెంటనే లక్ష్య సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. సాదారణంగా అయితే మొదటి రెండు సినిమా లు ఫ్లాప్ అయితే మూడవ సినిమా అవకాశం రావడం దాదాపు అసాధ్యం.

అలాంటిది కేతిక అందాల జాతర చూశాడో ఏమో కానీ రంగ రంగ వైభవంగా సినిమా దర్శకుడు ఏకంగా మెగా హీరోకు జోడీగా నటింపజేశాడు. మరోసారి ఆమెకు నిరాశ తప్పలేదు.

అందాల విందు విషయంలో మూడు సినిమాల్లో కూడా అవసరం ఉన్నా లేకున్నా కూడా అదరగొట్టింది. కానీ సినిమాలు మాత్రం నిరాశ పర్చాయి. అయినా మళ్లీ చేతిలో సినిమాలు ఉన్నాయట.

ఇలా ఒల్లు విరుస్తూ గుండె జారిపోయేలా ఫోటోలకు ఫోజ్ లు ఇస్తూ.. అందాల విందు చేస్తూ ఉంటే ముద్దుగుమ్మకు ఆఫర్లు రాక ఏం వస్తాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ముద్దుగుమ్మ అందాల విందుకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

అందుకే ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తున్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందాలు సరే కానీ అదృష్టంతో వచ్చే సినిమా అయినా ఈ అమ్మడికి సక్సెస్ ని తెచ్చి పెడుతుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.