అందుకే జెర్సీని వాళ్లంతా వద్దన్నారు

Mon Apr 15 2019 13:07:09 GMT+0530 (IST)

Story Behind Nani Jersey Movie Heroine Selection

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా జెర్సీ ఈ వారమే థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. నాని గత మూవీ దేవదాస్ వచ్చి ఏడు నెలలైన నేపధ్యంలో అభిమానులు దీని మీదే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ ఎలాగూ ఎమోషనల్ గా ఆకట్టుకునేలా ఉంది. సో కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటే కనక హిట్ అనే నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా జెర్సిలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ ను తీసుకోవడంపట్ల గతంలోనే కొన్ని సందేహాలు వచ్చాయి.నిజానికి ఈ పాత్ర కోసం కాస్త గ్లామర్ టచ్ తో పాటు రేంజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకునే ప్రయత్నాలే జరిగాయట. అయితే పదేళ్ల వయసు బాబుకు తల్లిగా చేయమంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అందుకే ఇది నలుగురైదురు దగ్గరికి వెళ్లి నో చెప్పించుకుని వచ్చిందట. ఒకవేళ తల్లిగా కాకూండా కేవలం నాని భార్యగా అయితే ఎవరో ఒకళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాళ్లేమో

శ్రద్ధ శ్రీనాథ్ టాలెంటెడ్ నటే. అందులో ఎలాంటి డౌట్ లేదు. కన్నడ యు టర్న్ తమిళ్ విక్రమ్ వేదాలో పెర్ఫార్మన్స్ కు ఫ్లాట్ అయ్యే పింక్ తమిళ్ రీమేక్ వెర్షన్ కు తనను ఏరికోరి ఎంపిక చేశారు. ఈ లెక్కన తెలుగులో నాని లాంటి స్టార్ హీరోతో డెబ్యూ ఛాన్స్ దొరకడం శ్రద్ధ శ్రీనాథ్ కు లక్కీనే అని చెప్పొచ్చు. కాకపోతే అలా కుర్రాడి తల్లిగా నటించాక సాధారణంగా గ్లామర్ రోల్స్ అంత ఈజీగా రావు. శ్రద్ధా శ్రీనాథ్ కు సైతం అలాంటివి అంతగా ఆసక్తి లేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సో జెర్సి కోసం ముందు ట్రై చేయడం అయితే కొందరు టాప్ హీరోయిన్స్ నే చేశారని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ కథలో బాబు లేకపోతే నాని పక్కన వేరే జోడి ఉండేదేమో