Begin typing your search above and press return to search.
లీక్స్ ని ఆపడం స్టార్స్ కు కూడా సంకటంగా మారిందా?
By: Tupaki Desk | 31 Jan 2023 10:00 AMసోషల్ మీడియా వాడకం రికార్డు స్థాయికి చేరిన ఈ రోజుల్లో లీకులకు కాదేదీ అనర్హం అన్నట్టుగా మారింది. ప్రవైట్ సంభాషణలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తున్న ఈ రోజుల్లో క్రేజీ స్టార్స్ సినిమాలకు పెరిగిన టెక్నాలజీ సంకటంగా మారుతోంది. గతంలో సినిమా పోస్ట్ ని విడుదల చేసినా కథేంటో అంచనా వేయడం కష్టంగా వుండేది. సినిమారిలీజ్ అయితే కానీ ఏ జానరో.. ఎలాంటి కథ అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని సినిమా సెట్స్ లో వుండగానే అన్నీ తెలిసిపోతున్నాయి.
దీనికి తోడు క్రేజీ స్టార్స్ సినిమాల లీకులు కూడా ఇప్పడు మరింత భారంగా మారాయి. సెట్ లో సిబ్బందిని ఎంత కట్టడి చేసినా ఏదో ఒక విధంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఆన్ లొకేషన్ వివరాలు, ఫొటోలు, వీడియోలు యధేశ్చగా నెట్టింట దర్శనమిచ్చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని శంకర్, రాజమౌళి లాంటి దర్శకులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించడం లేదు. పైగా క్రేజీ స్టార్ లు నటిస్తున్న సినిమాలకు ఇప్పుడు ఈ లీకుల బెడద మరీ ఎక్కువవుతోంది.
పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' నుంచి లీకులు స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లని కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ విషయంలో క్రేజీ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ వారి సినిమాలు ప్రతీ సారి లీకుల బెడదని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు నిర్మాణంలో వున్న రామ్ చరణ్ RC15, సలార్, పుష్ప 2, మహేష్ SSMB28 తాజాగా లీకుల బెడదని ఎదుర్కొంటున్నాయి. ఈ మూడు సినిమాలకు సంబంధించిన చాలా వరకు లీకవుతూ నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
బన్నీ నటిస్తున్న 'పుష్ప 2' షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. హీరో ఇంట్రడక్షన్ కు సంబంధించిన కీలక సాంగ్ ని అక్కడ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల లీక్ కావడం తెలిసిందే. ఇక రామ్ చరణ్ RC15 కూడా ప్రారంభం నుంచి లీకులతో సతమతమవుతూనే వుంది. ఇక మహేష్ బాబు నటిస్తున్న SSMB28 కు సంబంధించిన కీలక యాక్షన్ ఎపిసోడ్ ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ కావడం తెలిసిందే.
ఇక ప్రభాస్ 'సలార్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోల్ మైన్ లో ప్రభాస్ పై చిత్రీకరించిన యాక్షన్ ఘట్టాలకు సంబంధించిన స్టిల్స్, కీలక వీడియో బయటికి రావడంతో మేకర్స్ తలపట్టుకుంటున్నారు. రీసెంట్ గా 'సలార్' డైలాగ్ అంటూ ఓ ఆడియో నెట్టింట హల్ చల్ చేసి మేకర్స్ ని మరింత కలవరానికి గురిచేసింది. రాజమౌళి, శంకర్ లాంటి హేమా హేమీల సినిమాలే లీకులకు గురవుతున్న వేళ దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా అనే చర్చ జరుగుతోంది. పెరిగిన లెక్నాలజీ ఇలా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో అంతా తలలు పట్టుకుంటున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.