Begin typing your search above and press return to search.

వెంకీ హోస్టుగా రియాలిటీ షో ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..?

By:  Tupaki Desk   |   19 Jan 2022 2:30 AM GMT
వెంకీ హోస్టుగా రియాలిటీ షో ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..?
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అరవింద్.. ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాతగా బిజినెస్ మ్యాన్ గా డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్లే అల్లు అరవింద్.. 'ఆహా' ఓటీటీని దిగ్గజ డిజిటల్ వేదికలకు ధీటుగా నిలిపారు. ఈ క్రమంలో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ.. ఇండస్ట్రీలో ఎన్నో వేల మందికి ఉపాదిని కల్పిస్తున్నారు.

మెగా ఫ్యామిలీకి వెల్ విషర్ గా ఉన్న అల్లు అరవింద్.. కేవలం చిరంజీవినే కాకుండా ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకొని పోతున్నారు. ఇందులో భాగంగా ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణని తొలిసారిగా హోస్ట్ గా ప్రెజెంట్ చేశారు. ఆహా కోసం ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షోను రూపొందించి ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించారు. దీంతో అల్లు - నందమూరి ఫ్యామిలీల మధ్య బంధం కూడా బలపడింది.

ఇప్పటికే అక్కినేని కుటుంబంతో అల్లువారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు బాలయ్యతో కలిసి మెలిసి ఉంటున్న అల్లు వారు.. త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీతో కలవబోతున్నారట. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హోస్ట్ గా అల్లు అరవింద్ ఓ రియాల్టీ షో ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెంకీ.. ఇప్పుడు 'ఆహా' ఓటీటీ కోసం షో చేయడానికి రెడీ అయ్యారట.

తెలుగు ప్రేక్షకులకు 100 శాతం సరికొత్త వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో వచ్చిన 'ఆహా'.. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో వీక్షకులను అలరిస్తోంది. కొత్త సినిమాలు - వెబ్ సిరీస్ లతో పాటుగా స్పెషల్ టాక్ షోలు - గేమ్ షోలను అందించడం ప్రాంతీయ ఓటీటీ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్ తో ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.