ప్రభాస్ థ్రిల్లర్ కు స్టార్ ప్రొడ్యూసర్ కండీషన్స్?

Tue Jan 24 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Star producer C Aswanidat conditions for Prabhas thriller movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో మైథలాజికల్ డ్రామా `ఆది పురుష్` ని పూర్తి చేసిన ప్రభాస్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా పూర్తియి గ్రాఫిక్స్ రీవర్క్ జరుగుతున్న నేపథ్యంలో తదుపరి సినిమాలపై దృస్టి సారించాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. `ఆది పురుష్` పూర్తి కావడంతో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్ లున్నాయి.అందులో మూడు సినిమాలు చిత్రీకరణ దశలో వుండగా మరో ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా `సలార్` చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీని ఈ క్రేజీ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 28న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న `ప్రాజెక్ట్ కె` కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. వైజయంతీ బ్యానర్ 50 ఏళ్ల ప్రస్తానంలో ఈ మూవీని ఓ మైలు రాయిగా తీర్చి దిద్దుతున్నారు.

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే దిషా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో కనీ వినీ ఎరుగని సరికొత్త ప్రపంచం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీటితోపాటే ఫ్యాన్స్ వద్దని వారిస్తున్న మారుతితో ప్రభాస్ ఓ హారర్ థ్రిల్లర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ కండీషన్ పెడుతున్నారట. ఈ  మూవీని ఎట్టిపరిస్థితుల్లోనూ `ప్రాజెక్ట్ కె` తరువాతే రిలీజ్ చేయాలని ఈ సినిమాకు ముందు రిలీజ్ చేయడానికి వీళ్లేదని చెబుతున్నారట. ఈ విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. `ప్రాజెక్ట్ కె`మూవీని ఈ ఏడాది అక్టోబర్ లో కానీ లేదా 2024 జనవరిలో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన.

అయితే మారుతి సినిమాని మాత్రం ఈ ఏడాదే థియేటర్లలోకి తీసుకురావాలనే చర్చలు నడుస్తున్నాయట. ఈ విషయంలోనే అశ్వనీదత్ సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ రంగంలోకి దిగి అశ్వనీదత్ కు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ విషయంలో అశ్వనీదత్ వెనక్కి తగ్గుతారా? .. లేక మారుతి తన సినిమాని లేట్ గా రిలీజ్ చేస్తారా? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.