పార్టీ నైట్ మత్తుగా చిత్తుగా స్టార్ కిడ్స్ చిలౌట్

Wed Mar 29 2023 21:57:33 GMT+0530 (India Standard Time)

Star kids chillout at night party

నైట్ పార్టీలతో చిలౌట్ అవ్వడం బాలీవుడ్ స్టార్ కిడ్స్ కి కొత్తేమీ కాదు. బర్త్ డే ఈవెంట్లు.. ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్లు వగైరా వగైరా నిత్యకృత్యం. ఇవేగాక స్నేహితులంతా కలిసి విదేశీ విహారాలు.. ఒంటరి దీవుల విహారాలకు వెళ్లడం నిరంతరం చూస్తున్నదే.ముఖ్యంగా హీరోయిన్లుగా తొలి అడుగులు వేస్తున్న ఖుషీ కపూర్- సనాయా కపూర్- సుహానా ఖాన్ నిరంతరం పార్టీ క్రౌడ్ లో సందడి చేస్తున్నారు.

ఆ ముగ్గురిలో సుహానా- ఖుషీ ఇద్దరూ జోయా అఖ్తర్ రూపొందిస్తున్న వెబ్ సిరీస్ 'ఆర్చీస్'తో తెరకు పరిచయమవుతున్నారు. సనయా కపూర్ ని కరణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేస్తున్నారు.

బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ గ్యాంగ్ మంగళవారం రాత్రి  ట్రెండీ పార్టీలో సందడి చేసారు. రేయంతా డీజే హోరెత్తగా డ్యాన్సులతో సందడి చేసారని సమాచారం. స్టార్ కిడ్స్ తమ స్నేహితుల బృందంతో గుంపులుగా ఒకచోట చేరి హంగామా సృష్టించడంతో ఆ దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. ప్రస్తుతం ఈ పార్టీ నైట్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి తన స్నేహితురాలు తానియా ష్రాఫ్ 26వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసాడు. ఈ పార్టీకి అటెండయిన వారిలో ప్రముఖ సెలబ్రిటీ కిడ్స్ అంతా ఉన్నారు.

కింగ్ ఖాన్ షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్- ఖుషీ కపూర్- షానాయ కపూర్ లాంటి నటవారసులు ఈ పార్టీలో సందడి చేయగా.. అంజినీ ధావన్ తదితరులు పార్టీ నైట్ ఫోటోల్లో కనిపించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.