స్టార్ హీరోలందర్నీ విశ్వక్ ఎలా లాక్ చేస్తున్నాడబ్బా?

Sat Mar 18 2023 12:05:19 GMT+0530 (India Standard Time)

Star heros fans of vishwak sen

ఓ యంగ్ హీరో సినిమాని మరో స్టార్ హీరో ప్రమోట్ చేయాలంటే?  వెనుక చాలా విషయాలే ఉంటాయి. కానీ విశ్వక్ సేన్ విషయంలో ఇదంతా తప్పు అని అనిపించక మానదు.  అతని కోసం స్టార్ హీరోలే ముందుకొస్తున్నారు  `దాస్ కా దమ్కీ` ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతన్ని ఉద్దేశించి ఎలా వ్యాఖ్యానించారో?  తెలిసిందే. సినిమా పట్ల విశ్వక్ ఫ్యాషన్ ని  చూసిన మరో నటుడు ఎన్టీఆర్ గా చెప్పొచ్చు.ఆయన మాటలు మొదలు నుంచి ముగింపు వరకూ ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. యంగ్  టైగర్ మాటల్లో  మరోసారి విశ్వక్ సేన్ కసి..పట్టుదల ఎలా ఉంటుందన్నది కనిపించింది. చివరిగా విశ్వక్ సేన్ సెంటిమెంట్ డైలాగులు వేయడం  వంటివి తారక్ని  ఆవేదిక వరకూ తీసుకొచ్చాయి. ఓ పాన్ ఇండియా స్టార్ యువ హీరో గురించి అలా మాట్లాడుతుంటే? అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

అంతకు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా విశ్వక్ సేన్ గురించి అంతే ఆసక్తికరంగా స్పందించారు. అతని పనితనాన్ని ..సినిమా పట్ల తనకున్న ఫ్యాషన్ గురించి చరణ్ ఎంతో ఆసక్తికరంగా మాట్లాడారు. అలాగే గతంలో విక్టరీ వెంకటేష్ కూడా విశ్వక్ ని మెచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అతడిలో ఎనర్జీని హైలైట్ చేస్తూ వెంకీ ప్రశంసించిన విధానం ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కూడా విశ్వక్ అంటే ఎంతో అభిమానం చూపించారు. మరి ఇదంతా చేయడం విశ్వక్ కి ఎలా సాధ్యమంటే?  సినిమాలపై అతని కున్న ఫ్యాషన్.- కసి పట్లుదల అన్నది ఓ కారణమైతే..వ్యక్తిగతంగా విశ్వక్ పని ఆ స్టార్ హీరోలంతా ఎంతో అభిమానిస్తారు. ఆ నలుగురి మాటల్లో కామన్ గా కనిపించిన అంశం ఇదే.  ఆ రకంగా హీరోలందరికీ విశ్వక్ బాగా దగ్గరయ్యాడని చెప్పొచ్చు.

అలాగే విశ్వక్ పైకి లేపిన హీరో విషయంలో వ్యక్తిగతంగా తనకెలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వంటివి కూడా విశ్వక్ కి ప్లస్ గా మారినట్లు తెలుస్తోంది.  అందుకే విశ్వక్ మాటని తీసేయలేక తన సినిమాకి  సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది.  విశ్వక్  `వెళ్లిపోమాకే` నుంచి మొన్నటి `ఓరి దేవుడా` వరకూ ఒకే ఎనర్జీతో పని చేసాడు. నటుడిగా..దర్శకుడిగా..నిర్మాతగా పనిచేస్తున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.