ఏ స్టార్ హీరో ఎక్కడెక్కడ ఇరగదీస్తున్నాడంటే?

Wed Nov 30 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Star heros busy with shooting

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆన్ సెట్స్ లో బిజీగా ఉన్నారు. ఇన్ డోర్..ఔట్ డోర్ షూటింగ్ లంటూ డే అండ్ నైట్ శ్రమిస్తున్నారు. కొందరు హీరోలు రిలీజ్ తేదీలు కూడా లాక్ చేసి పెట్టడంతో వాటికగుణంగా పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న కృత నిశ్చయంతో పని చేస్తున్నారు.  ఓ హీరోలు ఎవరెవరు ఎక్కడెడక్కడ బిజీగా ఉన్నారో చూస్తే సరి.సంక్రాంతి  కానుకగా ఇప్పటికే `వాల్తేరు వీరయ్య`..`వీర  సింహారెడ్డి` బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తోన్న వాల్తేరు వీరయ్య ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ లో యూనిట్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. చిరుపై సన్నివేశాల్ని దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నారు.

మరో యూనిట్ ఇతర సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. బాలయ్య కథానాయకుడిగా నటిస్తోన్న `వీరసింహారెడ్డి` షూటింగ్  రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ `ప్రాజెక్ట్-కె`..`సలార్` షూటింగ్ ల్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు.

కొన్ని రోజులు ఒక సినిమా మరికొన్ని రోజులు మరో సినిమా సెట్స్ కి హాజరవుతున్నారు. అప్పుడప్పుడు మారుతి సినిమా సెట్స్ కి  వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ -కె షూటింగ్ శంకర పల్లిలో జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ మూడు వారాలుగా `హరి హర వీరమల్లు` సెట్ లోనే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో పీకే పై క్రిష్ సన్నివేశాలు  చిత్రీకరిస్తున్నారు.

అక్కడే లారెన్స్ నటిస్తోన్న`చంద్రముఖి -2` షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక ఆన్ సెట్స్ లో అల్లు అర్జున్ లేకుండా `పుష్ప -2` తెరకెక్కుతోంది. ప్రస్తుతం బన్నీ లేని సీన్స్ ఆర్ ఎఫ్ సీలో  షూట్ చేస్తున్నారు. డిసెంబర్ లో బన్నీ టీమ్ తో జాయిన్ కానున్నారు. అలాగే మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తోన్న `టైగర్ నాగేశ్వరరావు` శంషాబాద్ లో షూటిగ్ జరుగుతోంది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న `డీజేటిల్లు -2` షూటింగ్ అల్యుమినియం ఫ్యాక్టరీలో.. అలాగే త్రివిక్రమ్ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్ సారధి స్టూడియో లో జరుగుతున్నాయి. ఇక విక్టరీ వెంకటేష్..కింగ్ నాగార్జున  ఇంకా కొత్త ప్రాజెక్ట్ లు ప్రకటించలేదు. మహేష్ ఎస్ ఎస్ ఎంబీ షూటింగ్ త్వరలో మళ్లీ రీ స్టార్ట్ కానుంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.