Begin typing your search above and press return to search.

'బ్రోతల్ హౌస్ ఓనర్' పాత్రలో స్టార్ హీరోయిన్.. దసరాకు రిలీజ్ అంట!!

By:  Tupaki Desk   |   16 Jan 2021 8:58 AM GMT
బ్రోతల్ హౌస్ ఓనర్ పాత్రలో స్టార్ హీరోయిన్.. దసరాకు రిలీజ్ అంట!!
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉండే యంగ్ హీరోయిన్లలో అలియా భ‌ట్ పేరు ముందువరుసలో ఉంటుంది. సినిమా సినిమాకి అమ్మడు క్రేజ్ అమాంతం పెంచుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అన్నీ పెద్ద సినిమా ప్రాజెక్టులే ఉండటం విశేషం. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ చిన్నది. తను చేస్తున్న ప్ర‌తి ప్రాజెక్ట్‌కి ప‌క్కా ప్లానింగ్‌తో డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తోందట. ప్రస్తుతం అమ్మడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో అమ్మడు రాంచరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుంది. ఇక ఈ పాత్రకోసం ఏడాదిన్నర పైగా తెలుగు డైలాగ్స్ నేర్చుకుందట. అందుకే షూటింగ్ లో చకచకా తెలుగు డైలాగ్స్ చెప్పేసిందని ఇదివరకు వార్తలు బయటికి వచ్చాయి. అలాగే ఆర్ఆర్ఆర్ తో పాటు అలియా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'గంగుభాయి కతీయవాడి' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అలియా కెరీర్ లో చాలా స్పెషల్ గా ఉండబోతుందట.

అయితే ముంబైలోని కంటీపుర ఏరియాకు చెందిన ఫేమస్ బ్రోతల్ హౌస్ ఓనర్ గంగుబాయి బయోపిక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సంజయ్ భన్సాలీ. ఈ సినిమాలో అలియా గంగుబాయి యవ్వనం నుండి ముసలితనం వరకు ఎలా కనిపిస్తుందో అన్ని వెరియేషన్స్ లో కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాను లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి విడుదలకు రెడీ చేసేవారట. కానీ ఈ మద్యే షూటింగ్ ప్రారంభం కావడంతో ఈ సినిమాను ఏడాది రానున్న దసరా పండుగ సందర్బంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు కూడా డబ్ చేసి అందించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ తో అలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అవుతుంది. ఆ ఆలోచనతోనే గంగుబాయి మూవీని తెలుగులో విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం అలియా గంగుబాయి పాత్ర పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు సినీవర్గాలు భావిస్తున్నాయి. ఇక గంగుబాయిగా అలియా కనిపించడానికి హెవీ మేకప్ తో పాటు విఎఫ్ఎక్స్ ఫుల్లుగా వాడబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. చూడాలి బ్రోతల్ హౌస్ ఓనర్ గా అలియా ఎలా అలరిస్తుందో..!!