ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్న స్టార్ హీరోలు..!

Wed Jun 16 2021 14:00:27 GMT+0530 (IST)

Star heroes to start promotions

కరోనా రెండో దశ కారణంగా సినీ ఇండస్ట్రీలో కార్యక్రమాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. గత రెండు నెలలుగా షూటింగులు నిలిచిపోయి.. థియేటర్లు మూతబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు రోజురోజుకు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో టాలీవుడ్ లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో కొందరు మేకర్స్ సినిమాలను తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లారు. అలానే జులై చివరి వారం నుంచి థియేటర్లు కూడా రీ ఓపెన్ చేస్తారనే సంకేతాలు వస్తుండటంతో సినిమాల ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.వైరస్ ప్రభావంతో చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన వెంటనే వసూళ్లు ఆశాజనకంగా ఉంటే.. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి క్రేజీ మూవీస్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ - టీజర్స్ అంటూ బజ్ క్రియేట్ చేసిన కొన్ని సినిమాలు.. మళ్ళీ తిరిగి జానాల్లోకి వెళ్లాలని చూస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' 'పుష్ప' వంటి పెద్ద సినిమాలు కూడా ప్రమోషన్లను షురూ చేయనున్నారు. 'ఆచార్య' నుంచి త్వరలోనే రెండో పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకోగా.. 'పుష్ప' ఫస్ట్ సింగిల్ ఇవ్వాలని అనుకుంటున్నారట. మరి వీటిలో ముందుగా ఎవరు పబ్లిసిటీ మొదలుపెడతారో చూడాలి.