Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలంద‌రి చూపు ఆ మూడింటిపైనే!

By:  Tupaki Desk   |   29 May 2023 8:00 PM GMT
స్టార్ హీరోలంద‌రి చూపు ఆ మూడింటిపైనే!
X
ఏ స్టార్ హీరో టార్గెట్ అయినా ఇప్పుడేది అంటే? `బాహుబ‌లి`..`కేజీఎఫ్`..`ఆర్ ఆర్ ఆర్`..`దంగ‌ల్` వ‌సూళ్ల వైపే చూపిస్తారు. ఇండియాని షేక్ చేసిన చిత్రాలుగా ఖ్యాతికెక్క‌డంతో! హీరోలంద‌రి టార్గెట్ అవే. `బాహుబ‌లి -2`..`దంగ‌ల్` లాంటి చిత్రాల వసూళ్ల‌ని బీట్ చేయ‌లేక‌పోయినా క‌నీసం 1500 కోట్ల వ‌సూళ్లు అయినా కొల్ల‌గొట్టాలన్న‌ది హీరోలంద‌రి ప్లాన్. మ‌రి ఇప్పుడా ఛాన్స్ ఏ హీరోల‌కి ఉంది? ఏ ప‌రిశ్ర‌మ‌కి ఎక్కువ‌గా అవ‌కాశాలున్నాయి అంటే అంద‌రి టాలీవుడ్ వైపే చూపిస్తున్నారు. ఓ సారి ఆ సినిమాలపై లుక్ ఏస్తే..

భారీ అంచ‌నాల మ‌ధ్య `పుష్ప‌-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ స్థాయిలోనే చిత్రాన్ని ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు బ‌న్నీ-సుకుమార్. పుష్ప ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చినా పుష్ప‌-2 మాత్రం భారీ అంచ‌నాల మీద రావ‌డంతో! లెక్క పెర‌గాలే గానీ త‌గ్గ‌డానికి వీల్లేద‌ని బ‌ల‌మైన క‌మిట్ మెంట్ తో బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్నారు. మినిమంగా 1000కోట్లు వ‌సూళ్ల టార్గెట్ తో చిత్రాన్ని బ‌రిలోకి దించుతు న్నారు. అంత‌కు మించి వ‌సూళ్లు తేవాల‌న్న‌ది సుక‌మార్ లెక్క‌.

ఇక ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ప్రాజెక్ట్-కె`..`స‌లార్` లాంటి సినిమాలైతే ఏకంగా `దంగ‌ల్`.. `బాహుబ లి-2` వ‌సూళ్లు టార్గెట్ గానే బ‌రిలోకి దించుతున్నారు. విష‌యం ఓపెన్ గా చెప్ప‌లేదు గానీ ప్ర‌శాంత్ నీల్-ప్ర‌భాస్- నాగ్ అశ్విన్ ఈ ర‌క‌మైన టార్గెట్ ని ముందే ఫిక్స్ చేసుకుని వార్ లోకి ఎంట‌ర్ అయ్యారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలుగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. టెక్నిక‌ల్ గా ప్రాజెక్ట్ -కెని హైలైట్ చేయ‌బోతున్నారు. ఈ రెండు సినిమాలు క‌లిపి 4000 కోట్లు టార్గెట్ తోనే బ‌రిలోకి దిగుతున్న‌ట్లు స‌మాచారం.

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ 15వ చిత్రం `గేమ్ ఛేంజ‌ర్` కూడా చాలా పెద్ద లెక్క‌తోనే వ‌స్తుంది. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత శంక‌ర్ ని రంగంలోకి దించిన‌ప్పుడే చ‌ర‌ణ్ ప్లాన్ ఏమై ఉంటుందా? అన్న సందేహం మొద‌లైంది. తాజాగా మెగా హీరో బాక్సాఫీస్ ని షేక్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోనే ద‌ర్శ‌క దిగ్గ‌జాన్ని సీన్ లోకి తెచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా 1000 కోట్లు మినిమం వ‌సూళ్లు టార్గెట్ గా రేస్ లోకి దిగుతుంది. శంక‌ర్ కాన్సెప్ట్ జ‌నాల‌కి ఎక్కిందంటే? ఎన్నికోట్లు అయినా కొల్ల‌గొడుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.