Begin typing your search above and press return to search.

సంధిగ్ధంలో స్టార్ హీరో తమ్ముడి సినిమా.. ఓటిటి బాటపట్టనుందా..??

By:  Tupaki Desk   |   15 Jun 2021 11:30 PM GMT
సంధిగ్ధంలో స్టార్ హీరో తమ్ముడి సినిమా.. ఓటిటి బాటపట్టనుందా..??
X
గతేడాది కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కారణంగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు అవకాశం లేక మీడియం - చిన్నపాటి సినిమాలు డిజిటల్ రిలీజ్ బాటపడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడి సినిమా కూడా ఓటిటి రిలీజ్ వైపు ప్లాన్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ కుర్రహీరో ఎవరో కాదు.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం ఆనంద్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి విజయ్ దేవరకొండ వేరే సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషించి ఆ తర్వాత హీరోగా మారి స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

అయితే తమ్ముడు ఆనంద్ దేవరకొండ వేరే హీరోల సినిమాలలో నటించకుండా దొరసాని అనే సినిమాతో డైరెక్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తన రెండో ప్రయత్నంగా మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఓటిటిలో రిలీజ్ అయింది. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించారు మేకర్స్. అయితే ఆ హిట్ తర్వాత ప్రస్తుతం 'పుష్పకవిమానం' పేరుతో మరో సినిమా చేస్తూనే ఉన్నాడు ఆనంద్.

డెబ్యూ దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గీత్ సైని - శాన్వి మేఘన హీరోయిన్స్ కాగా విజయ్ దేవరకొండ సమర్పణలో 'కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ - టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు మ్యూజిక్ అందిస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల - సిద్దార్థ్ సదాశివుని - అమిత్ దాసాని వర్క్ చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఓటిటి వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసం ఆపితే మాత్రం బడా సినిమాల మధ్యలో నలిగిపోయే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం పై మేకర్స్ ఓటిటి వైపు ఆలోచన చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఆనంద్ మూవీ ఏ బాటపడుతుందో..!