Begin typing your search above and press return to search.

ఆరేళ్ల‌లో 1750‌ కోట్లు సంపాదించిన స్టార్ హీరో?

By:  Tupaki Desk   |   5 Jan 2021 6:00 AM IST
ఆరేళ్ల‌లో 1750‌ కోట్లు సంపాదించిన స్టార్ హీరో?
X
వంద కోట్లు .. రెండు వంద‌ల కోట్లు కాదు.. ఏకంగా 1750 కోట్ల‌కు సుమారుగా సంపాదించాడు ఆ స్టార్ హీరో. ఖాన్ ల త్ర‌యానికే సాధ్యం కాని రీతిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆర్జ‌న ఒక సంచ‌ల‌నం అనే చెప్పాలి. అతని 6 సంవత్సరాల ఆదాయాలు ప‌రిశీలిస్తే ఏకంగా 1744 కోట్లు అని తేలింది. 2014 నుండి 2020 వరకు అత‌డి ల‌క్ చుక్క‌ల్ని తాకింది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. అక్షయ్ 6 సంవత్సరాల ఆదాయాలు సుమారు 2వేల కోట్లు అని తేలింది.

కోవిడ్-19 మహమ్మారి కొన‌సాగుతున్న‌ 2020లోనూ కిలాడీ భారీ ఆదాయం ఆర్జించాడు. ఈ ఏడాది అత‌డి మొత్తం ఆదాయాలు 48.5 మిలియన్లు (రూ .356.57 కోట్లు) అని ఫోర్బ్స్ నివేదించింది. అతను 2019 లో 65 మిలియన్లు (రూ. 459.22 కోట్లు) సంపాదించాడు. 2018 లో 40.5 మిలియన్లు (రూ. 277.06 కోట్లు),.. 2017 లో 35.5 మిలియన్లు (రూ. 231.06 కోట్లు),... 2016 లో .5 31.5 మిలియన్లు (రూ. 211.58 కోట్లు) .. 2015లో 32.5 మిలియన్లు (రూ. 208.42 కోట్లు) మునుపటి సంవత్సరాల్లో అక్షయ్ సంపాదించారు.

భారీ పారితోషికాలు దాంతో పాటు అక్షయ్ తన అన్ని సినిమాల లాభాలలో మంచి వాటాను కూడా అందుకుంటాడు. అతను సంవత్సరాలుగా అనేక సినిమాలను విజయవంతంగా నిర్మించాడు. మ‌రోవైపు క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల రూపంలోనూ అత‌డు అంతే భారీగా ఆర్జిస్తున్నాడు.