Begin typing your search above and press return to search.

లాయర్ పాత్రలో స్టార్ హీరో.. 'పవర్ స్టార్'ను ఫాలో అవుతున్నాడా..??

By:  Tupaki Desk   |   7 May 2021 10:52 AM GMT
లాయర్ పాత్రలో స్టార్ హీరో.. పవర్ స్టార్ను ఫాలో అవుతున్నాడా..??
X
సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోలలో ఒకరు సూర్య. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా అదే రేంజి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ప్రతిసారి డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలతో సూర్య టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. గజినీ సినిమా మొదలుకొని రీసెంట్ 'ఆకాశం నీ హద్దురా' వరకు అన్ని సినిమాలు తెలుగు డబ్ వెర్షన్ రిలీజ్ అవుతున్నాయి. అయితే సూర్య ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్లాప్ లలో ఉన్నప్పుడు ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మళ్లీ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేసాడు. ప్రస్తుతం సూర్య చేతిలో అరడజను వరకు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే తాజాగా సూర్య 41వ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సూర్య 40వ మూవీ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

41వ సినిమాను 'కుత్తట్టిల్ ఓరుదన్' ఫేమ్ టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయనున్నాడు హీరో. ఇంకా పేరు ఖరారు కానీ ఎవరు సినిమా ఆల్రెడీ ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. సూర్య కెరీర్ లోనే ఫస్ట్ టైం న్యాయవాదిగా నటిస్తున్నాడు. ప్రతి సినిమాలో కొత్తదనం చూపించే సూర్య.. ఇప్పుడు ఎన్నడూ చేయని లాయర్ పాత్రలో నటిస్తున్నాడని అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వతున్నారు. అయితే ఈ సినిమాలో సూర్య 'ఇరులా' అనే గిరిజనతెగ కోసం పోరాడే న్యాయవాదిగా కనిపించనున్నాడట. అలాగే ఈ సినిమాను సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో సూర్యకు జోడిగా కర్ణన్ ఫేమ్ రజిషా విజయన్ నటిస్తోంది. అయితే ప్రస్తుతం సూర్య మూవీస్ లైనప్ పై సోషల్ మీడియాలో పలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. లాయర్ పాత్రలో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సూర్య కూడా అదే బాటలో వెళ్తున్నట్లు టాక్. సూర్య - జ్ఞానవెల్ దర్శకత్వంలో కోర్టు డ్రామా మూవీ చేసాక ఆ తర్వాత ఓ పీరియాడిక్ మూవీ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉందట. మరి పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.