ఆ భయంతోనే స్టార్ హీరో రంగంలోకా?

Thu Jul 07 2022 16:00:01 GMT+0530 (IST)

Star hero in the field Fear

ఇటీవలే ఇద్దరు స్టార్ హీరోలు- మరో క్రేజీ దర్శకుడు కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ సినిమా ఇండస్ర్టీ రికార్డులు సైతం తిరగరాస్తుందని రిలీజ్ ముందు వరకూ బోలెడన్ని అంచనాలు. పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వలేదు గానీ..అయితే గనుక పాన్ ఇండియా వద్ద సంచలనం తప్పనిసరి మీడియా క థనాలు సైతం అంతే వేడెక్కించాయి.కానీ ఫలితం ఒకటి అనుకుంటే? మరోలా వచ్చింది. ఇదంతా గతించిన గతం. ఇప్పుడు భవిష్యత్  ఏంటి ? అన్నదే ముఖ్యం. ఆ దిశగానే ప్రణాళిక ఉండాలి. సరిగ్గా ఇప్పుడా ద్వయం భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకునే సె ట్స్ కెళ్లిన సినిమా కథలో సైతం వేళ్లు పెడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అదే స్టార్ హీరోతో ఓ మాస్ కమర్శియల్ డైరెక్టర్ ఓ సినిమా చేస్తున్నాడు.

ఆ హీరోని ఎంతో అభిమానించి..ఎంతో ప్రేమతో ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన అభిమానమంతా సినిమాలో కనిపిస్తుందని ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటి కే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తి చేసాడు. అయితే ఇప్పుడా కథలో ఆ స్టార్ హీరో వేళ్లు పెడుతున్నట్లు సమాచారం. కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తి నెలకొనడంతో అవసరమైన సూచనలు..సలహాలు ఇచ్చి ఆ బాద్యతని ఓ సీనియర్ రైటర్ కి అప్పగించినట్లు వినిపిస్తుంది.

అతను కామెడీ ట్రాక్ ని రాయడంలో సిద్దహస్తుడు. సరిగ్గా అతని చేతుల్లోనే స్ర్కిప్ట్ నిపెట్టి  కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఎలివేషన్ బాధ్యతలు అతనికి అప్పగించినట్లు సమాచారం.  వాటిని  అద్భుతమైన ఫన్ తో నింపేయాలని..అదే సమయంలో హ్యూమర్ కి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారుట.

ప్రస్తుతం  సినిమాని డైరెక్ట్ చేస్తున్న అతనికి కామెడీపై అంత పట్టు లేకపోవడంతోనే ఆ బాధ్యతలు అప్పగించినట్లు  తెలుస్తోంది. గత సినిమా విషయంలో దొర్లిన తప్పులు ఈ సినిమాలో దొర్లకూడదనే నేరుగా సీనియర్ రైటర్ నే దించినట్లు తెలుస్తోంది. గత సినిమా డైరెక్టర్ కి కూడా  కామెడీ పై ఏమంత పెద్దగా పట్టులేదు.

ఆ స్టార్ హీరో నమ్మకంతో ఆ బాధ్యతలు అతనికే అప్పజెప్పాడు. కానీ సింకింగ్ గానీ..కామెడీ టైమింగ్ గానీ ఏదీ సరిగ్గా కుదరల్దేదు. అనుభవం ఉన్న రైటర్ అయితేనే వాటిని సమర్ధవంతగా రాయగలడని భావించి ఈసారి కేవలం సలహాల వరకే పరిమితమైనట్లు  తెలుస్తోంది. అంతేగా అనుభవం గుణపాఠాల్ని నేర్పుతుంది.