'హలోబ్రదర్' మెగాస్టార్ చేసుంటే బాగుండేది: స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Thu Jun 10 2021 22:00:01 GMT+0530 (IST)

Star director sensational comments

టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ - ఫ్యామిలీ ఎమోషన్స్ - లవ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించి చెరగని ముద్ర వేసినటువంటి దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో.. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అభిమానులు ఆయనను.. ఆయన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈవివి బర్త్ డే సందర్బంగా ట్విట్టర్ లో బుధవారం రాత్రి ఈవివి స్పేస్ నిర్వహించారు టాలీవుడ్ సెలబ్రిటిలు ఫ్యాన్స్. దాదాపు ఈ సెషన్ లో నాలుగు వేలకు పైగా ఫ్యాన్స్ హాజరు అయినట్లు తెలుస్తుంది.ఈ ఈవివి స్పేస్ సెషన్ లో ఈవివి తనయుడు అల్లరి నరేష్ - డైరెక్టర్స్ హరీష్ శంకర్ సుధీర్ వర్మ కళ్యాణ్ కృష్ణ బివిఎస్ రవి అనిల్ రావిపుడిలతో పాటు ఫ్యాన్స్ కూడా ఈ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ స్పెషల్ సెషన్ సందర్బంగా ఈవివి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'హలో బ్రదర్'(1994) పేరు చర్చల్లోకి వచ్చింది. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ హలో బ్రదర్ సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “హలో బ్రదర్ సినిమా చూసిన తరువాత.. నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ ఎలా సూపర్ సినిమాను మిస్ అయిపోయారని చాలా బాధపడ్డాను. ఖచ్చితంగా మెగాస్టార్ ఈ సినిమా చేసి ఉండాల్సింది.

కానీ 'హలోబ్రదర్' మూవీ కింగ్ నాగార్జున లోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆయనలోని కామెడీ టైమింగ్ - డైలాగ్ డెలివరీ ఈ చిత్రంలో హైలైట్. అయితే హలోబ్రదర్ సూపర్ హిట్ తర్వాత మేము మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఫస్ట్ డే మార్నింగ్ షోకు వెళ్లినట్లుగా నాగార్జున గారి సినిమాలకు వెళ్లడం ప్రారంభించాము." అంటూ చెప్పుకొచ్చాడు. హలో బ్రదర్ మూవీ పై హరీష్ మాటలకు మెగా ఫ్యాన్స్ హ్యాపీ అయినప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈవివి గురించి చాలా విషయాలు మాట్లాడాడు.

ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ హరీష్ శంకర్ తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. అయితే తన మాటలపై అక్కినేని ఫ్యాన్స్ బాధపడ్డారనే విషయం తెలిసి హరీష్.. ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా తమ అభిమాన హీరో మిస్ అయినప్పుడు ప్రతి సినీప్రేమికుడు బాధపడటం సహజం. అంతేగాని నాగ్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వాలని కాదు. అంతేగాక రియల్ ఫ్యాన్స్ అయితేనే అరే మా హీరోకు ఇలాంటి సినిమా ఎలా మిస్ అయింది అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. హరీష్ ఉద్దేశం కేవలం చిరంజీవి మిస్ అయ్యాడని మాత్రమే కానీ నాగ్ వద్దని కాదంటూ ఫ్యాన్స్ సర్ది చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నాడు.