'ఎన్టీఆర్'తోనే స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా ఎంట్రీ..!

Mon May 03 2021 17:00:02 GMT+0530 (IST)

Star director Pan India entry with 'NTR'

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో జనతాగ్యారేజ్(2017) అనే బ్లాక్ బస్టర్ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి జతకడుతుంది. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొరటాల ఇదే సినిమా పై పనిచేస్తున్నాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా రావాలంటూ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. గతేడాది విడుదల కావాల్సిన ఆచార్య సినిమా.. కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఏడాది మే 13న ఆచార్య సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చేసరికి మళ్లీ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఆచార్య చివరిదశలో ఉంది. ఈ సినిమా తర్వాత కొరటాల తదుపరి సినిమాల విషయంలో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రస్తుతం షూటింగ్ లేదని.. ఆ సమయాన్ని ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడట. కానీ ఈసారి స్క్రిప్ట్ లో భారీ మార్పులు కనిపించనున్నాయని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ విడుదల కాబోతుంది.

మరి ఆ లెక్కన ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ పరిచయం కాబోతున్నాడు. అంటే ఇకపై ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉంది. అయితే రాబోయే పాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కొరటాల బృందం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్. మరి కొరటాల ప్రాజెక్ట్ అంటే కాస్తో కూస్తో సందేశత్మకంగా ఉంటాయి. మరి ఈసారి ఎలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయనున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోను ఇటీవలే సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు 2022 ఏప్రిల్ 22న సినిమా రిలీజ్ అని డేట్ కూడా ప్రకటించారు. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి కొరటాల పాన్ ఇండియా ఎంట్రీ ఎలా ఉండబోతుందో!