స్టార్ కపుల్ విడాకులు.. ఇంతకీ తప్పెవరిది?

Wed Jan 19 2022 11:15:21 GMT+0530 (IST)

Star couple divorce

సౌత్ నార్త్ లో క్రేజీ స్టార్ గా వెలిగిపోతున్న ప్రముఖ తమిళ స్టార్ హీరో భార్య నుంచి విడిపోతున్న సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న సడెన్ గా ఈ జంట నుంచి విడాకుల ప్రకటన రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. 18ఏళ్ల పాటు సంసారం సాగించిన ఈ జంట విడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.కానీ ఈ విడాకులకు కారణం ఎవరు?  తప్పు ఎవరి వైపు ఉంది? అంటూ జోరుగా ఆరాలు సాగుతున్నాయి. ఈ జంట మధ్య చాలా కాలంగా మనస్ఫర్థలు ఉన్నా కానీ ఇలానే కలతలతోనే జీవనం సాగిస్తున్నారు. ఇక ఇప్పుడు కలిసి ఉండే కంటే విడిపోవడమే మేలని టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఇందులో సదరు హీరోగారి తప్పిదాలే పెద్దవన్న గుసగుసా ఫిలింనగర్ లో నడుస్తోంది.

సదరు  స్టార్ హీరో సైలెంట్ ప్లే బాయ్ అని.. అతడితో పని చేసిన కొందరు హీరోయిన్లే చెవులు కొరుక్కుంటున్నారని గుసగుస వినిపిస్తోంది. వాస్తవానికి ఓ సినిమా జంట విడిపోతే ఇలాంటి రూమర్స్.. విమర్శలు రావడం సహజం కానీ ఆ హీరో మీద ఇంత త్వరగా వస్తాయని ఎవరూ ఊహించలేదు. మరోవైపున విడాకుల ప్రహసనంతో తమిళనాట సదరు హీరో ప్రభ తగ్గే అవకాశం ఉందని సినీ నిపుణులు అంటున్నారు. తమిళ అగ్ర నటుడి అల్లుడి హోదాలో అతడికి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇకపై ఆ ఫ్యాన్స్ అందరూ కెరీర్ పరంగా సపోర్ట్ చేసే అవకాశం లేదని టాక్ వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది.