యంగ్ హీరో పంచాయితీకి స్టార్ ప్రొడ్యూసర్ ఎండ్ కార్డ్

Fri May 13 2022 14:00:00 GMT+0530 (IST)

Star Producer End Card to Young Hero Controversy

బిగ్ స్టార్ ల సినిమాలు పాన్ ఇండియా మూవీస్ మధ్య చిన్న సినిమాల ప్రమోషన్స్ వాటిని ప్రేక్షకుల ముందుక తీసుకెళ్లాలంటే స్మాల్ మూవీ మేకర్స్ చిన్న పాటి యుద్ధమే చేయాల్సి వస్తోంది. పబ్లిసిటీల కోసం కోట్ల ఖర్చే చేసే స్టోమత లేని వారు తమ సినిమాని తోచిన దారుల్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. కొంత మంది వైరల్ వీడియోలతో తమ సినిమాకు పబ్లిసిటీని క్రియేట్ చేసుకోవడం ఇటీవల వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఓ రెబల్ హీరో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఈ సారైన తనని నమ్ముకున్న ప్రేక్షకులకు తనని అభిమానించే ఫ్యాన్స్ కు మంచి చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతో కొత్త తరహా ఫ్యామిలీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. అయితే పాన్ ఇండియా చిత్రాల హవాలో ప్రేక్షకుల దృష్టిని తన సినిమా వైపు తిప్పుకోవాలంటే ఏదైనా కొత్తగా చేయాలని దాంతో తన సినిమా వైరల్ గా మారాలని అనుకున్నాడు. ఓ యూట్యూబ్ యాంకర్ ని రంగంలోకి దింపు సూసైడ్ పేరుతో ప్రాంక్ వీడియో చేశాడు.

యంగ్ హీరో ప్లాన్ వర్కవుట్ అయి వీడియో వైరల్ అయింది. అతని సినిమా వార్తల్లో నిలిచింది. అయితే తను చేసిన ప్రాంక్ వీడియో కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందని అతనిపై చర్యలు తీసుకోవాలంటే కొంత మంది నానా రకాలుగా న్యూస్ క్రియేట్ చేశారు. ఓ టీవీ ఛానల్ ఏకంగా సదరు యంగ్ హీరోపై లైవ్ డిబేట్ నే నిర్వహించింది. తనని కూడా డిబేట్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డిబేట్ ని నిర్వహిస్తున్న సదరు లేడీ యాంకర్ సహనం కోల్పోయి హీరోని రెచ్చగొట్టింది. అసభ్ పదజాలంతో అతనిపై విరుచుకుపడింది.

ఇది నచ్చని సదరు యంగ్ హీరో యాంకర్ పై విరుచుకుపడ్డాడు. ఓ బూతు పదాన్ని వాడాడు. దీంతో సదరు యాంకర్ మరింతగా రెచ్చిపోయి యంగ్ హీరోని నా స్టూడియో నుంచి గెట్ ఔట్ అంటూ అతన్ని తీవ్రంగా అవమానించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది యంగ్ హీరోకు అండగా నిలవగా.. మరి కొంత మంది యాంకర్ కు సపోర్ట్ చేశారు. అయితే ఎంటైర్ ఎపిసోడ్ లో పూర్తి మద్దతు మాత్రం యంగ్ హీరోకే లభించింది. ఫలితంగా తను కోరుకున్నట్టే సినిమా కు ఫ్రీ పబ్లిసిటీ లభించి అతనికి హిట్ దక్కింది.

అయితే సదరు యాంకర్ తో విరోదం యంగ్ హీరోకు ఇబ్బందుల్ని కలిగించే ప్రమాదం వుందని గ్రహించిన ఇండస్ట్రీ వర్గాలు ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించి టీవి ఛానల్ - హీరో మధ్య సయోధ్య  కుదర్చడానికి మెగా ప్రొడ్యూసర్ మాస్టర్ మైండ్ రంగంలోకి దిగారట.

ఇదే ఛానల్ కు సంబంధించిన కీలక వ్యక్తులు భాగస్వాములుగా వ్యవహరిస్తున్న ఓటీటీని రన్ చేస్తున్న సదరు మెగా ప్రొడ్యూసర్ ఆ చనువుతో యంగ్ హీరోకు సదరు టీవి ఛానల్ కు మధ్య సయోధ్య కుదిర్చి వివాదాన్ని సద్దుమనిగే ప్రయత్నాలు మొదలు పెట్టారట. సదరు మెగా ప్రొడ్యూసర్ రంగంలోకి దిగడంతో ఇద్దరి మధ్య వివాదం సమసిపోయిందని త్వరలోనే యంగ్ హీరో సదరు టీవీ ఛానల్ లో ప్రత్యక్షం కావడం ఖాయం అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.