పదే పదే హీరోయిన్లకు పిచ్చెక్కిస్తున్న జ్యోతిష్కుడు?

Fri Mar 31 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

Star Heroines Doing Rraja Syamala Homam

సెంటిమెంటు పరిశ్రమలో ఎవరు దేనిని విశ్వసిస్తారో ఎవరూ ఊహించలేం. కొందరు హీరోలు అగ్ర నిర్మాతలు టాప్ డైరెక్టర్లు సినిమాల పూజా కార్యక్రమాల వేళ .. టైటిల్ నిర్ణయం వేళ.. రిలీజ్ సమయంలో చాలా సెంటిమెంట్లను అనుసరిస్తారు. పూజలు పునస్కారాలు వగైరా వగైరా నిత్యకృత్యం. కోట్లాది రూపాయల వ్యాపారంతో ముడిపడిన అంశం కాబట్టి ప్రతిదానికి సెంటిమెంట్ ను ముడిపెట్టడం చాలా రొటీన్.నందమూరి బాలకృష్ణ- బెల్లంకొండ శ్రీనివాస్ సహా చాలా మంది సెలబ్రిటీలు స్టార్ డమ్ ఉన్నవాల్లు సెంటిమెంటుకు కట్టుబడి ఉన్నారు. వారం వర్జ్యం పూజ్యం రాజభోగం అంటూ తమ పూజారులు జ్యోతిష్కులు గణాంక శాస్త్ర నిపుణులు హస్త సాముద్రిక నిపుణులు చెప్పేవాటిని వినేందుకు ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు.

ఇక టాలీవుడ్ ప్రముఖుల్లో మెజారిటీ వర్గం గాడ్ ఫియర్ కి అతీతులు కానేకాదు. రాహుకేతు ప్రభావం తగ్గించుకునేందుకు నిరంతరం శ్రీకాళహస్తిని సందర్శించేవాళ్లు ఉన్నారు. తిరుపతి హుండీకి మొక్కుబడులు తీర్చుకోనిదే నిదుర పట్టని వాళ్లకు కొదవేమీ లేదు. ఇక స్థానికంగా గుడులు గోపురాల్లో అమ్మవారికి పూజలు పునస్కారాలు మొక్కులు తీర్చుకోని సెలబ్రిటీ లేరు. జూబ్లీహిల్స్ నడిబొడ్డున ఉన్న పెద్దమ్మ వారి దేవాలయానికి .. ఫిలింనగర్ దైవసన్నిధానానికి వెళ్లని టాలీవుడ్ సెలబ్రిటీలు ఉండరంటే అతిశయోక్తి కానే కాదు.

అదంతా అటుంచితే సౌత్ లో పలువురు అగ్ర కథానాయికలు మేనేజర్లు పీఆర్ లు సూచించే కొన్ని శుభకర సూచనలు.. పూజా కార్యక్రమాలను తప్పక అనుసరించాలని ఆరాటపడుతుంటారు స్టార్లు. ఇందులో పలువురు స్టార్ హీరోయిన్లు ఉన్నారు. స్వీటీ అనుష్క శెట్టి చాలా సార్లు తిరుపతిని శ్రీకాళహస్తిని సందర్శించారు. అక్కడ మొక్కులు తీర్చుకున్నారు. సమంత - నయనతార వంటి వారు వేర్వేరు హిందూ తీర్థయాత్రలకు వెళ్లడం నిత్యకృత్యం. అయితే ఇటీవలి కాలంలో స్టార్ హీరోయిన్లు `రాజ శ్యామల హోమం` నిర్వహించడంలో తలమునకలుగా ఉన్నారు.

ఇటీవల సమంతా హైదరాబాద్ లోని తన నివాసంలో 12 మంది పూజారులతో రాజ శ్యామల హోమం నిర్వహించారు. కొన్ని ఆలయాల్లో హోమాలు చేసారు. అదే బాటలో రష్మిక మందన.. నిధి అగర్వాలు హోమాల బాట పట్టడం తాజాగా చర్చనీయాంశమైంది. రష్మిక మందన సౌత్ నుంచి నార్త్ కి జంప్ చేయాలని చూసినా అది వెంటనే సరైన ఫలితాన్ని అందించలేదు. అందువల్ల తన కాలగమనంలో శక్తులను పూజించాలని ప్రముఖ జ్యోతిష్కుడు సూచించారని తెలిసింది.

రాజ శ్యామల హోమం చేయాలని కూడా పూజారులు సూచించారట. దీంతో  హైదరాబాద్ నుండి కర్నాటకకు పూజారులతో నిండిన బస్సులో నేషనల్ క్రష్ రష్మిక వెళ్లినట్లు పుకారు వినిపించింది. రేసులో వెనకబడ్డ మరో అందాల హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇదే హోమం చేసేందుకు పూజారులను హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లారట. అది అలా అలా ఆ నోటా ఈ నోటా పాకడంతో ముంబై హీరోయిన్లు ఇప్పుడు వెర్రెక్కిపోతున్నారని తెలిసింది.

ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే -కృతి సనన్- 2. రాశి ఖన్నా-రకుల్ ప్రీత్- శాన్వి శ్రీ- నివేతా పేతురాజ్-.

ప్రగ్యా జైస్వాల్ తదితర జాబితా చేరిందని తెలిసింది.  వీరంతా హైదరాబాద్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా పెద్దమ్మ ఆలయంలో పూజలు చేయిస్తారు. ఫిలింనగర్ దైవసన్నిధానాన్ని సందర్శిస్తారు. అవసరం మేర హోమాలు నిర్వహిస్తుంటారు.  రాజ శ్యామల హోమం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది. అయితే సదరు హీరోయిన్లు అంతా ఏ జ్యోతిష్కుని సలహా పాటిస్తున్నారు? ఇంతకీ ఎవరా సెలబ్రిటీ జ్యోతిష్కుడు.. ఎవరా సెలబ్రిటీ పూజారి? అంటూ ఇప్పుడు ఆరాలు మొదలయ్యాయి. పలువురు స్టార్ హీరోల సెంటిమెంట్లపైనా తదుపరి ఆర్టికల్ లో .. వెయిట్ అండ్ వాచ్ దిస్ స్పేస్..